ప్రముఖ మెసెజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చాలామంది ఉపయోగిస్తున్న సోషల్ మీడియా యాప్స్ లో వాట్సాప్ కూడా ఒకటి. ఈ వాట్సాప్ సంస్థ ఇప్పటికే వినియోగదారుల కోసం ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. వినియోగదారులను ఆకర్షించడం కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తూనే ఉంది. ఇకపోతే మాములుగా వాట్సాప్ ఉపయోగించే వారికి ఎదురయ్యే ప్రధాన సమస్యల్లో వాట్సాప్ చాట్ బ్యాకప్ కూడా ఒకటి.
కొత్త మొబైల్ ఫోన్ తీసుకున్నా లేదంటే ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్ చేసినా పాత మెసేజ్‌లను బ్యాకప్ చేసుకోవడం సాధారణమైన విషయమే. కానీ
ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నారు. వాట్సాప్ ట్రాన్స్‌ఫర్ చాట్ హిస్టరీ అనే ఫీచర్ పేరుతో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఈ ఫీచర్‌తో కేవలం ఒకే ఒక క్లిక్‌తో వాట్సప్ చాట్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్ సహాయంతో యూజర్లు గూగుల్ డ్రైవ్‌ను ఉపయోగించకుండానే పాత ఫోన్ నుంచి కొత్త ఫోన్‌కి చాట్ హిస్టరీని ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.
అయితే ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే ఇందుకోసం యాప్ సెట్టింగ్స్‌లో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే సరిపోతుంది. వెంటనే మీ పాత వాట్సాప్ చాట్స్ బ్యాకప్ అవుతాయి. ప్రస్తుతం వాట్సాప్ బ్యాకప్ కోసం ఐక్లౌడ్ లేదా గూగుల్ డిస్క్‌కి బ్యాకప్ చేసి ఆ తరువాత మరో ఫోన్‌లో చాట్ హిస్టరీ పొందేవారు. అయితే ఇప్పుడు ఈ సమస్య లేకుండా కేవలం ఒకే ఒక్క స్కాన్ తో చాట్ హిస్టరీని బదిలీ చేసేందుకు ఫీచర్ ఉపయోగపడుతుంది.