WhatsApp: ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల కొద్దీ ప్రజలు మెసేజింగ్, కాలింగ్ కోసం ఉపయోగిస్తున్న వాట్సాప్ ఇప్పుడు తన ‘వెబ్ వెర్షన్’ను మరింత శక్తివంతంగా మార్చేందుకు సిద్ధమవుతోంది. మొబైల్, డెస్క్‌టాప్ యాప్‌లలో ఇప్పటికే అందుబాటులో ఉన్న గ్రూప్ వాయిస్, వీడియో కాల్ ఫీచర్ త్వరలో వాట్సాప్ వెబ్‌లో కూడా వచ్చే అవకాశం ఉంది.
వాట్సాప్ వెబ్‌లో గ్రూప్ కాలింగ్.. ఏం మారబోతోంది?
ప్రస్తుతం వాట్సాప్ వెబ్ ద్వారా కేవలం టెక్స్ట్ మెసేజ్‌లు, స్టేటస్, నోటిఫికేషన్‌లను మాత్రమే మేనేజ్ చేయగలం. కాలింగ్ ఫీచర్ కేవలం మొబైల్ యాప్, డెస్క్‌టాప్ యాప్‌లకే పరిమితమై ఉంది. కానీ తాజా నివేదికల ప్రకారం.. మెటా ఇప్పుడు ఈ సదుపాయాన్ని బ్రౌజర్ ప్లాట్‌ఫారమ్‌కు కూడా విస్తరించాలని చూస్తోంది. అంటే మీరు ప్రత్యేకంగా డెస్క్‌టాప్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయకుండానే నేరుగా బ్రౌజర్ నుండి గ్రూప్ కాల్స్ చేయవచ్చు లేదా వాటిలో చేరవచ్చు. ఆఫీసు పనులు లేదా కాలేజీ ప్రాజెక్టుల కోసం ల్యాప్‌టాప్/PC ఉపయోగించే వారికి ఈ అప్‌డేట్ ఎంతో మేలు చేస్తుంది. ఇది జూమ్ (Zoom), గూగుల్ మీట్ (Google Meet) వంటి ప్లాట్‌ఫారమ్‌లకు గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది.
Also Read: బీజేపీలోకి ఘర్ వాపసీ , తమిళనాట రాజకీయాలు ఇంకాస్త రసవత్తరం
గ్రూప్ కాల్ ఫీచర్ వల్ల కలిగే ప్రయోజనాలు
నేరుగా వెబ్ బ్రౌజర్ నుండి కాల్స్: మొబైల్ యాప్‌లో లాగానే వెబ్ బ్రౌజర్‌లో కూడా గ్రూప్ వాయిస్, వీడియో కాల్‌లను ప్రారంభించవచ్చు.
కాల్ లింక్‌ల తయారీ: వినియోగదారులు కాల్ లింక్‌లను క్రియేట్ చేసి ఇతరులతో షేర్ చేయవచ్చు. ఆ లింక్ ద్వారా ఎవరైనా సులభంగా కాల్‌లో చేరవచ్చు. ఇది పెద్ద గ్రూప్ మీటింగ్స్‌కు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
షెడ్యూల్డ్ కాలింగ్: వాట్సాప్ వెబ్‌లో కాల్‌లను ముందే షెడ్యూల్ చేసే సదుపాయం కూడా రావచ్చు. కాల్ పేరు, సమయం, వివరాలను సెట్ చేయడం ద్వారా గ్రూప్ సభ్యులందరికీ ముందే నోటిఫికేషన్ వెళ్లేలా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది. త్వరలోనే యూజర్లందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
