WhatsApp: వాట్సాప్ లో మరో సరికొత్త ఫీచర్.. చాట్ విండోలో కొత్త టేబుల్!

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిత్యం కోట్లాదిమంది ఉపయోగిస్తున్న మెసేజ

  • Written By:
  • Updated On - March 11, 2024 / 07:31 PM IST

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిత్యం కోట్లాదిమంది ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్స్ లో వాట్సాప్ ముందు వరుసలో ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక వాట్సాప్ వినియోగదారుల సంఖ్య రోజుకి పెరుగుతూనే ఉండడంతో వినియోగదారులను మరింత ఆకర్షించడం కోసం వాట్సాప్ సంస్థ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తూనే ఉంది. కాగా ఇప్పటికే పదుల సంఖ్యలో కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేసిన వాట్సాప్ సంస్థ ఇప్పుడు వినియోగదారుల కోసం మరో సరికొత్త ఫీచర్ ని తీసుకురాబోతోంది. వాట్సాప్ యూజర్లకు సెక్యూర్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ అందిస్తుందనే విషయం మనకు తెలుసు.

అంటే మెసేజ్ పంపినవారు, రిసీవ్ చేసుకున్న వారు తప్ప మూడో వ్యక్తి చూడలేరు. ఈ సెక్యూరిటీ గురించి వాట్సాప్ యూజర్లకు ఎప్పుడూ తెలియజేస్తుంది. అయితే ఆ విషయాన్ని ఇప్పుడు చాట్‌లోనే స్పష్టంగా తెలియజేయాలని భావిస్తోంది. ఇందుకు చాట్ స్క్రీన్‌పై ప్రముఖంగా కనిపించే కొత్త లేబుల్‌ను టెస్ట్ చేస్తోంది. ప్రస్తుతానికి కొంతమంది బీటా టెస్టర్లకు మాత్రమే ఈ ఫీచర్ కనిపిస్తోంది. ఈ లేబుల్ ఒక చాట్‌పైన ప్రొఫైల్ ఐకాన్‌కు పక్కన లేదా కింద ఉంటుంది. చాట్‌లోని కన్వర్జేషన్లు ఎన్‌క్రిప్ట్‌ అయినట్లు ఈ లేబుల్ యూజర్లకు తెలియజేస్తుంది. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ – చాట్ క్యాప్షన్ అని పిలిచే ఈ ఫీచర్ ప్రస్తుతం బీటా టెస్టర్లకు రిలీజ్ అయింది. దీని గురించి మొదట వాట్సాప్‌ బీటా ఇన్ఫో లేటెస్ట్ రిపోర్టు వెల్లడించింది.

వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా లేటెస్ట్ వెర్షన్లకు యాక్సెస్ ఉన్న యూజర్లు రాబోయే రోజుల్లో ఈ అప్‌డేట్‌ను అందుకోవచ్చు. వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా 2.24.6.7, 2.24.6.8, 2.24.6.10, 2.24.3.17, 2.24.6.11 వెర్షన్లకు అప్‌డేట్ అయిన వారు కాంటాక్ట్ లేదా గ్రూప్ పేరు కింద ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ అనే లేబుల్‌ని గమనించవచ్చు. కాగా ఈ మార్పు వాట్సాప్ వెబ్ బీటా వెర్షన్‌లో కూడా కనిపించింది. ఇంతకుముందు, వాట్సాప్‌లో చాట్ల ఎన్‌క్రిప్షన్ స్టేటస్‌ను వెరిఫై చేయడానికి గజిబిజిగా ఉండే ప్రక్రియ ద్వారా వెళ్లాల్సి వచ్చేది. అయితే, కొత్త బీటా అప్‌డేట్‌తో ఈ సమాచారం కోసం యూజర్లు అనేక దశల ద్వారా నావిగేట్ చేయాల్సిన తలనొప్పులు ఉండవు. ఎందుకంటే ఈ సమాచారం తక్షణమే అందుబాటులోకి వస్తుంది. ఈ కొత్త ఫీచర్ త్వరలోనే వినియోగదారులందరికీ పూర్తి స్థాయిలో విడుదల కావచ్చని వాట్సాప్ బీటా ఇన్ఫో లేటెస్ట్ రిపోర్ట్ తెలిపింది. యూజర్లకు డేటా భద్రత గురించి, ముఖ్యంగా యూరోపియన్ యూనియన్‌లోని మెసేజింగ్ యాప్‌ల ఇంటర్‌ ఆపరబిలిటీ గురించి భరోసా ఇవ్వడం వాట్సాప్ లక్ష్యంగా పెట్టుకుంటోంది. అందులో భాగంగా ఈ అప్‌డేట్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ నెలలో అమల్లోకి రానున్న కొత్త నిబంధనల కారణంగా యూజర్లు హై-ఎన్‌క్రిప్షన్ ప్రమాణాలతో వివిధ ప్లాట్‌ఫామ్స్‌లో మెసేజ్‌లు పంపించుకోవచ్చు. వాట్సాప్ కొత్త ఫీచర్‌తో డేటా సేఫ్టీకి సంబంధించి మరింత పారదర్శకతను అందిస్తోందని చెప్పుకోవచ్చు. ఎన్‌క్రిప్షన్ లేబుల్‌తో వాట్సాప్ ప్రైవసీ, సెక్యూరిటీ పట్ల నిబద్ధతను బలోపేతం చేస్తోంది. యాప్ EUలో ఇంటర్‌ఆపరబుల్‌గా మారడానికి సిద్ధమవుతున్న తరుణంలో.. వినియోగదారులు కమ్యూనికేషన్లు, వాట్సాప్ లేదా ఇతర యాప్‌ల ద్వారా అయినా, బలమైన ఎన్‌క్రిప్షన్ సెక్యూరిటీ పొందుతారు.