Site icon HashtagU Telugu

WhatsApp Pin Chat : వాట్సాప్ ఛాట్‌లను ఇలా ‘పిన్’ చేసేయండి

Whatsapp Pin Chat

Whatsapp Pin Chat

WhatsApp Pin Chat : త్వరలోనే వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ రాబోతోంది. అదే ‘వాట్సాప్ పిన్ ఛాట్’ !! దీని ద్వారా మనం మిత్రులు, సన్నిహితుల నుంచి వచ్చే వ్యక్తిగత వాట్సాప్ మెసేజ్‌లను పిన్ చేసి.. ఛాట్ ఫీడ్‌ ఎగువ భాగంలో కనిపించేలా హైలైట్ చేయొచ్చు. ఆ మెసేజ్ ఎంత టైం పాటు హైలైట్ అయి ఉండాలనేది కూడా డిసైడ్ చేయొచ్చు. 24 గంటలు, 7 రోజులు, 30 రోజులు ఇలా మనకు ఇష్టం వచ్చిన టైం వ్యాలిడిటీని మనం నిర్ణయించవచ్చు. ఇక వాట్సాప్ గ్రూప్‌లోనూ మనం ఏదైనా మెసేజ్‌ను పిన్ చేయొచ్చు. అయితే దీనికి కొన్ని షరతులు ఉన్నాయి. మెసేజ్‌లను పిన్ చేసే వెసులుబాటును వాట్సాప్ గ్రూప్‌లోని సభ్యులందరికీ కల్పించాలా ? వద్దా ? అనేది గ్రూప్ అడ్మిన్‌లు డిసైడ్ చేయాల్సి ఉంటుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇలా పిన్ చేయాలి

  • ఈ ఫీచర్‌ను వాడేందుకుగానూ మీరు పిన్ చేయాల్సిన వాట్సాప్ ఛాట్‌ను నొక్కి పట్టుకోండి.
  • అనంతరం త్రీ డాట్స్‌లోకి వెళ్లి ‘పిన్’ అనే ఆప్షన్‌ను సెలెక్ట్  చేసుకోవాలి.
  • అనంతరం ‘పిన్’ చేసే వాట్సాప్ ఛాట్‌ను ఎంత టైం పాటు హైలైట్ చేయాలనే టైం లిమిట్‌ను ఎంపిక చేయండి.
  • ఆ తర్వాత మీరు పిన్ చేసిన ఛాట్ అనేది .. వాట్సాప్ ఫీడ్‌లో ఎగువ భాగంలో హైలైట్ అవుతుంది. ఈ కొత్త ఫీచర్‌లోని మరో విశేషం ఏమిటంటే.. మీరు టెక్స్ట్, పోల్, ఇమేజ్‌లు, ఎమోజీల వంటి సందేశాలను కూడా పిన్ చేయొచ్చు. ఇలా పిన్ చేసే చాట్‌లు(WhatsApp Pin Chat) అన్ని ఇతర సందేశాల మాదిరిగానే ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్‌గా సేఫ్‌గా ఉంటాయి.

Also Read: Israel Vs Gaza : సొంత బలగాల దాడిలో ఇజ్రాయెలీ సైనికుల మృతి!