Site icon HashtagU Telugu

Whatsapp: వాట్సాప్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. మెసేజ్ వస్తుంది కానీ నోటిఫికేషన్ రాదట!

Whatsapp

Whatsapp

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సంస్థ ఇప్పటికే పదుల సంఖ్యలో ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. రోజు రోజుకీ వినియోగదారుల సంఖ్య పెరుగుతుండడంతో వినియోగదారులను మరింత ఆకర్షించడం కోసం కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తూనే ఉంది. ఇందులో భాగంగానే తాజాగా మరో సరికొత్త ఫీచర్ ని తీసుకువచ్చింది వాట్సాప్ సంస్థ. మరి ఆ వివరాల్లోకి వెళితే.. కాగా మాములుగా ఆఫీసు లేదా పబ్లిక్ ప్లేస్‌లో ఫోన్‌ ను ఉపయోగిస్తున్నప్పుడు చాలా సార్లు గోప్యత ప్రమాదంలో ఉంటుంది.

మన చుట్టు పక్కల ఉన్నవారు ఫోన్‌ ని చూస్తే మరిన్ని సమస్యలు తలెత్తుతాయి. అందుకే చాలామంది సీక్రెట్ గా పక్కకు వెళ్లి మరీ చాటింగ్లో చేయడం వీడియో కాల్స్ మాట్లాడటం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ మీరు ఈ సమస్యను నివారించవచ్చు. ఈ వాట్సాప్ రహస్య ఫీచర్ మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ రహస్య ఫీచర్ ఏమిటి? ఎలా ఉపయోగపడుతుంది అన్న విషయానికి వస్తే.. వాట్సాప్ మెసేజ్ రావాలి కానీ దాని నోటిఫికేషన్ ఎవరూ చూడకూడదు అనుకుంటే ఈ విధానాన్ని అనుసరించాలి.

ఇందుకోసం ముందుగా మీ ఫోన్ సెట్టింగ్స్‌ లోకి వెళ్లి కొద్దిగా కిందికి స్క్రోల్ చేస్తే యాప్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. యాప్స్ ఎంపికపై క్లిక్ చేసి, కొంచెం కిందికి స్క్రోవాట్సాప్ సంస్థ వినియోగదారుల కోసం మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చిందిల్ చేయాలి. ఇక్కడ మీకు వాట్సాప్ ఎంపిక కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. వాట్సాప్‌ పై ట్యాప్ చేసిన తర్వాత నోటిఫికేషన్‌ లకు వెళ్ళాలి. దిగువన మీరు మూడు చిహ్నాలను చూస్తారు. ఇవి దాదాపు అన్ని ఫోన్‌ లలో డిఫాల్ట్‌ గా ఉంటాయి. ఈ మూడు ఎంపికలను నిలిపివేయాలి. ఇలా చేస్తే వాట్సాప్ నుంచి మెసేజ్ వచ్చినప్పుడు ఫోన్ లో వైబ్రేషన్ లేదా సౌండ్ వస్తుంది కానీ డిస్ ప్లేలో నోటిఫికేషన్ కనిపించదు. ఈ విధంగా చేస్తే చాలు మీరు మీ వాట్సాప్ చాటింగ్ ఇంకా ఎక్సెట్రా అవి ఇతరులకు కనిపించకుండా జాగ్రత్త తీసుకోవచ్చు.