Whats app: వాట్సాప్ సూపర్ అప్డేట్.. ఇక ఒక గ్రూప్ లో వెయ్యిమంది ఉండొచ్చు!

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి అందులో ఉన్న ఫీచర్ ల గురించి మనందరికీ తెలిసిందే. వాట్సాప్ ను

  • Written By:
  • Publish Date - October 10, 2022 / 05:29 PM IST

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి అందులో ఉన్న ఫీచర్ ల గురించి మనందరికీ తెలిసిందే. వాట్సాప్ ను దేశవ్యాప్తంగా ప్రతిరోజు కొన్ని లక్షల మంది ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా ఎక్కువ శాతం మంది చాటింగ్ చేయడానికి ఈ మెసేజ్లు చేసుకోవడానికి వాట్సాప్ ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీంతో వాట్సాప్ సంస్థ వారు వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్డేట్ లను ఫీచర్లను తీసుకొస్తూనే ఉన్నారు. ఇప్పటికే వాట్సాప్ లో అనేక రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే.

వాట్సాప్ లోనే రకరకాల వాట్సాప్ లను మాత్రమే కాకుండా వాట్సాప్ ఫీచర్స్ లో కూడా అనేక రకాల అప్డేట్లను విడుదల చేశారు. ఇప్పటికే చాటింగ్, గ్రూప్స్, మెసేజ్ డిలీట్, ప్రైవసీ,ప్రొఫైల్, స్టేటస్ ఇలా అనేక రకాల అప్డేట్లను తీసుకువచ్చిన వాట్సాప్ సంస్థ తాజాగా మరొక అదిరిపోయే ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. తాజాగా వాట్సాప్ సంస్థ తీసుకు వచ్చిన ఫీచర్ తో వినియోగదారులు షాక్ అవ్వడంతో పాటు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరి ఆ వాట్సాప్ యొక్క సూపర్ అప్డేట్ ఏమిటి అన్న విషయానికి వస్తే.. కాగా ఇప్పటివరకు వాట్సాప్ గ్రూపుల్లో కేవలం 512 మంది మాత్రమే ఉండడానికి అవకాశం ఉండేది. అయితే వాట్సాప్ సెమిస్టర్ గారు దానిని అప్డేట్ చేస్తూ 512 మంది లిస్ట్ కాస్త వెయ్యి వరకు పెంచేశారు. ఇకపై వాట్సాప్ గ్రూపులో 512 కు డబల్ అనగా 1024 మందిని చేర్చే అధికారాన్ని వాట్సాప్ గ్రూప్ అడ్మిషన్స్ కు ఇచ్చింది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్,ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టం,వాట్సాప్ బీటా వర్షన్ లో అందుబాటులోకి రానుంది. ఇక ఈ వార్త విన్న వాట్సాప్ వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.