Whatsapp: వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్.. ఆన్లైన్ లో ఉన్నట్టు కనిపించేది ఆ కొందరికి మాత్రమే?

వాట్సాప్ సంస్థ వినియోగదారుల కోసం ఇప్పటికే ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వచ్చిన విషయం

  • Written By:
  • Publish Date - August 10, 2022 / 10:11 AM IST

వాట్సాప్ సంస్థ వినియోగదారుల కోసం ఇప్పటికే ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే మామూలుగా మనము వాట్సాప్ లో ఆన్ లైన్ ఉన్నప్పుడు మనకు నచ్చని వారికి మన లాస్ట్ సీన్ కనిపించకుండా చేయాలి అని అనుకుంటూ ఉంటాము. ఈ క్రమంలోనే చాలామందికి వాట్సాప్ లోని మరిన్ని సీక్రెట్ తెలియక ఎవరికైతే వారి లాస్ట్ సీన్ కనిపించకుండా ఉండాలి అనుకుంటారు వాళ్ల నెంబర్ ను బ్లాక్ చేస్తూ ఉంటారు. కాగా వాట్సాప్ లో మామూలుగా లాస్ట్ సీన్ నోబడి క్లిక్ చేసిన అవతలి వ్యక్తి ఆన్లైన్ ఉన్నప్పుడు మనము ఆన్లైన్ అని చూపిస్తుంది. అయితే ఒకవేళ మనం లాస్ట్ సీన్ కనిపించకుండా ఆఫ్ చేస్తే ఇతరుల లాస్ట్ సీన్ మనకు కనిపించకుండా పోతుంది. ఇలాంటప్పుడు చాలామంది మళ్లీ వాట్సాప్ లోకి వెళ్లి లాస్ట్ సీన్ ఆప్షన్ ని ఆన్ చేసుకొని చూస్తూ ఉంటారు.

అయితే ఇటువంటి అవసరం లేకుండా వాట్సాప్ సంస్థ వారు వినియోగదారుల కోసం అవతలి వ్యక్తులు ఆన్ లైన్ లో ఉన్నదీ, లేనిదీ కనిపించేలా చేసుకునే సదుపాయాన్ని వాట్సాప్ అందుబాటులోకి తీసుకురానుంది. వీటితో పాటుగా గ్రూపుల్లోంచి ఎవరికీ తెలియకుండా ఎగ్జిట్ కావడం, అలాగే ఒకసారి చూసిన వెంటనే డిలీట్ అయిపోయేలా మెసేజీలు పంపడం, అలా పంపిన వ్యూ వన్స్ మెసేజీలను స్క్రీన్ షాట్ తీసుకునే వీలు లేకుండా చేయడం వంటి మరిన్ని సదుపాయాలనూ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది వాట్సాప్ సంస్థ. అయితే ఇవన్నీ కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తాయని వాట్సాప్ ప్రకటించిన విషయం తెలిసిందే. వాట్సాప్ గ్రూపుల్లో నోటిఫికేషన్ లేకుండా ఎగ్జిట్ అవ్వడం. మనం చాలా వాట్సాప్ గ్రూపులలో ఉంటుంటాం. కొన్నిసార్లు మొహమాటానికి లేదంటే ఆ గ్రూప్లో మనకు నచ్చని వ్యక్తులు ఉన్నప్పుడు వాటిలోంచి ఎగ్జిట్ అవుతూ ఉంటారు.

అయితే మనం ఎగ్జిట్ అయినప్పుడు గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్ వస్తుంది. ఎవరేం అనుకుంటారోనన్న ఇబ్బంది. ఈ క్రమంలోనే గ్రూపుల్లో ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా ఎగ్జిట్ అయ్యే సదుపాయాన్ని వాట్సాప్ సంస్థ త్వరలోనే తీసుకురానుంది. అయితే గ్రూప్లో ఉన్న వారికి తెలియకపోయినా గ్రూపు అడ్మిన్లకు మాత్రం ఈ విషయం తెలుస్తుందని వాట్సాప్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. అయితే మనం ఆన్ లైన్ ఉన్న విషయం ఎవరెవరికి కనబడాలో వారికే మనం వాట్సాప్ ఓపెన్ చేసి ఉన్నామా, లేదా అన్న విషయం అందరికీ తెలియడం మనకు ఇష్టం ఉండదు. ఆన్ లైన్ లో ఏం చేస్తున్నారు, ఎవరితో చాట్ చేస్తున్నారన్న ప్రశ్నలు ఎదురవుతూ ఇబ్బంది పెడుతుంటాయి. ఎవరైనా మెసేజ్ చేసినప్పుడు ఆన్ లైన్ లో ఉండి కూడా సమాధానం ఇవ్వడం లేదేమన్న ప్రశ్నలూ కూడా మనకి మనసులో మెదలుతూ ఉంటుంది. అలాగని అందరికీ కనిపించకుండా ఆఫ్ చేసుకోవడం ఇష్టం లేని వారి కోసం వాట్సాప్ కొత్త సదుపాయాన్ని తెస్తోంది. ఆన్ లైన్ లో ఉన్న విషయం కొందరికే కనిపించేలా, లేదా కొందరికిమాత్రమే కనిపించకుండా ఆఫ్ చేసుకునే ఆప్షన్ అందుబాటులోకి రానుంది.