Site icon HashtagU Telugu

whatsapp: వాట్సాప్ లో మరో సరికొత్త ఫీచర్.. వాట్సాప్ నుంచే ఫేస్ బుక్ స్టేటస్?

Whatsapp

Whatsapp

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిత్యం లక్షలాది మంది వినియోగదారులు చాటింగ్ కోసం,వీడియో కాల్స్ ఇతర అవసరాల కోసం వాట్సాప్ ని ఉపయోగిస్తూనే ఉంటారు. అంతేకాకుండా రోజురోజుకీ స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్యతో పాటు వాట్సాప్ వినియోగదారుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. దీంతో వాట్సాప్ సంస్థ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తూనే ఉంది.

ఈ నేపథ్యంలోనే తాజాగా వాట్సాప్ సంస్థ మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే.. సోషల్ మీడియా యాప్స్ అయినా వాట్సాప్ ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్, మెటా సంస్థకు చెందిన యాప్స్ అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఎప్పుడైతే ఈ మూడు యాప్స్ మెటా కిందకు వచ్చాయో అప్పటి నుంచి అన్ని యాప్స్ అనుసంధానం చాలా సులభమైపోయిందని చెప్పవచ్చు. కాగా ఇప్పటికే ఇంస్టాగ్రామ్ నుంచి పోస్టులు, కంటెంట్ ని ఫేస్ బుక్ లో కూడా షేర్ చేసే సదుపాయాన్ని కల్పించిన విషయం తెలిసిందే.

అలాగే ఇప్పుడు ఆ ఫీచర్ ని వాట్సాప్ లోకి కూడా అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అంటే మీరు వాట్సాప్ లో స్టేటస్‌ పెడితే దానిని తర్వాత ఫేస్ బుక్ లో విడిగా పెట్టుకోవాల్సి ఉండేది. కానీ ఇప్పుడు మీరు ఒకే స్టేటస్‌ ఒకేసారి వాట్సాప్‌, ఫేస్ బుక్ లో పోస్ట్ చేయవచ్చు. స్టేటస్ ప్రైవసీ సెట్టింగ్స్ లో ఇప్పటివరకు మై కాంటాక్ట్స్, మై కాంటాక్ట్స్‌ ఎక్స్ పెక్ట్, ఓన్లీ షేర్ విత్ అని ఆప్షన్స్ ఎలా అయితే ఉన్నాయో అలాగే త్వరలో ఫేస్ బుక్ అనే ఆప్షన్ కూడా అందుబాటులోకి వస్తుంది. ఆ తర్వాత మీరు ఫేస్ బుక్ అనే ఆప్షన్ ని ఎనేబుల్ చేసుకుని వాట్సాప్‌ లో స్టేటస్‌ పెడితే మీ ఫేస్ బుక్ ఖాతాలో కూడా పోస్ట్ అవుతుంది. ఇందుకోసం మీరు మీ ఫేస్ బుక్ ఖాతాని వాట్సాప్ అకౌంట్ కి అనుసంధానం చేయాల్సి ఉంటుంది.