Site icon HashtagU Telugu

WhatsApp New Feature: వాట్సాప్ వినియోగదారులకు మరో శుభవార్త.. ఇకపై ఒకే యాప్ లో రెండు అకౌంట్స్?

Whatsapp New Feature

Whatsapp New Feature

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిత్యం లక్షలాది మంది వినియోగదారులు వాట్సాప్ ని ఉపయోగిస్తూనే ఉన్నారు. చాటింగ్ కోసం,వీడియో కాల్స్ అలాగే ఇతర అవసరాల కోసం వాట్సాప్ ని ఉపయోగిస్తూనే ఉంటారు. అంతేకాకుండా రోజురోజుకీ స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్యతో పాటు వాట్సాప్ వినియోగదారుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. దీంతో వాట్సాప్ సంస్థ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తూనే ఉంది.

ఈ నేపథ్యంలోనే తాజాగా వాట్సాప్ సంస్థ మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. వాట్సాప్ తన వినియోగదారుల కోసం ఒకే యాప్‌లో రెండు వేర్వేరు వాట్సాప్ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి అవకాశం కల్పిస్తోంది. అంటే ఒక స్మార్ట్‌ ఫోన్‌లో రెండు సిమ్‌లు ఉంటే ఈ రెండు సిమ్‌ల కోసం ఒకే మొబైల్‌లో రెండు వాట్సాప్ అకౌంట్స్ ఓపెన్ చేసే వీలు ఉంటుంది. ప్రస్తుతం వాట్సాప్ సంస్థ ఈ ఫీచర్‌ను డెవలప్ చేస్తోంది. మరికొద్ది రోజుల్లో ఆండ్రాయిడ్, iOS వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే, ఈ కొత్త ఫీచర్ ప్రస్తుతం వాట్సాప్ బిజినెస్ వెర్షన్‌లో పని చేస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణ వెర్షన్‌కు కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుందని సమాచారం.

కాగా ఆండ్రాయిడ్‌లోని కొన్ని బీటా టెస్టర్‌లకు వాట్సాప్ రీడిజైన్ చేసిన ఎమోజి కీబోర్డ్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ రీడిజైన్ చేయబడిన ఎమోజి కీబోర్డ్‌పై స్క్రోల్ చేయడం సహా మల్టీపుల్ ఆప్షన్స్ అందిస్తోంది. GIF, స్టిక్కర్, అవతార్‌లు అందుబాటులో ఉన్నాయి. రీడిజైన్ చేసిన కీబోర్డ్ ప్రస్తుతం కొంతమంది బీటా టెస్టర్‌లకు అందుబాటులో ఉంది. కొన్ని వారాల్లో వినియోగదారులందరికీ అందుబాటులోకి వస్తుందని సమాచారం. వాట్సాప్ కొత్త క్రాప్ టూల్ ఆప్షన్‌ను తీసుకువచ్చింది. వాట్సాప్ విండోస్ బీటాలో డ్రాయింగ్ ఎడిటర్ కోసం కొత్త క్రాప్ టూల్ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా ఫోటోలను సెట్ చేసుకోవడం, కట్ చేసుకోవడం వంటివి చేయొచ్చు. గతంలో వినియోగదారులు తమ ఫోటోలను షేర్ చేయడానికి ముందు వాటిని క్రాప్ చేయడానికి ఎడిటింగ్ ఆప్షన్ ఉండేది. కానీ, ఈ కొత్త ఫీచర్.. యాప్‌లోనే నేరుగా ఫోటోలను క్రాప్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.