Tech Lookback 2024 : ప్రపంచంలో అత్యధికంగా వినియోగించే మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్, 2024లో యూజర్లకు కొత్త ఫీచర్స్‌తో సరికొత్త అనుభవం అందించే పనిలో ఉంది. మోటా యాజమాన్యంలోని ఈ యాప్‌ను ప్రపంచవ్యాప్తంగా నాలుగు బిలియన్ల మంది వినియోగిస్తున్నారు. ఫొటోలు, వీడియోలు, మెసేజ్‌లు షేర్ చేస్తూ, వాట్సాప్ సరికొత్త ఫీచర్లను పరిచయం చేసింది.
మెటా AI చాట్‌బాట్
2024లో మొదటిసారిగా మెటా ఏఐ చాట్‌బాట్‌ని ప్రారంభించింది. ఈ చాట్‌బాట్ యూజర్లకు అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇస్తూ, ఇమేజెస్‌ను రూపొందించేందుకు సహాయం చేస్తుంది. టెక్స్ట్ ఇచ్చినప్పుడు ఏఐ క్వాలిటీ తగ్గకుండా ఇమేజెస్‌ను జనరేట్ చేస్తుంది.
స్టేటస్ అప్‌డేట్‌లో ట్యాగ్స్, లైక్స్
ఇన్‌స్టాగ్రామ్‌లో లైకులు ఇచ్చే విధంగా ఇప్పుడు వాట్సాప్‌లో కూడా స్టేటస్ అప్‌డేట్‌లకు లైకులు ఇచ్చే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా మీకు నచ్చిన స్టేటస్‌కి లైక్ చేయవచ్చు.
వీడియో కాల్ ఫిల్టర్‌లు
వీడియో కాల్స్ చేయడానికి ఇష్టపడే వారికి మరింత సరదాగా మారే ఫిల్టర్‌లు జోడించారు. ఈ ఫీచర్లు జూమ్, గూగుల్ మీట్ వంటి వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్‌లతో పోటీగా నిలిచాయి. వాట్సాప్ వీడియో కాల్స్‌లో AR కాల్ ఎఫెక్ట్స్, ఫిల్టర్లు, బ్యాక్‌గ్రౌండ్ చేంజింగ్ కూడా అందుబాటులోకి వచ్చాయి.
వాయిస్ మెసేజ్ ట్రాన్స్‌క్రిప్షన్
వాయిస్ సందేశాలను టెక్స్ట్‌గా మార్చే ఫీచర్‌ను కూడా పరిచయం చేసింది. వాయిస్ సందేశాన్ని వినే స్థితిలో లేనిప్పుడు ముఖ్యమైన సమాచారాన్ని సులభంగా రికార్డ్ చేసుకునేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.
ఇంటర్‌ఫేస్‌లో మార్పులు
వాట్సాప్ డిజైన్‌లో కూడా కొత్త మార్పులు చేర్పు చేసుకుంది. ఇప్పుడు ఈ కొత్త ఇంటర్‌ఫేస్‌ను ఒక చేత్తో కూడా సులభంగా ఉపయోగించవచ్చు. టాబ్‌ల మధ్య సులభంగా మారవచ్చు, అదేవిధంగా కొత్త సింబల్స్ కూడా అదనంగా కనిపిస్తాయి.
ఫేవరేట్ చాట్
వాట్సాప్ కొత్త ఫీచర్లలో “ఫేవరేట్ చాట్” కూడా ఉంది. ఈ ఫీచర్ ద్వారా, ముఖ్యమైన చాట్స్‌ను కస్టమ్ లిస్ట్‌లో జోడించుకోవచ్చు. ఇలాగే, మీరు తరచూ వెతికే చాట్స్‌ని సులభంగా ప్రాప్తించడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.
ఈ కొత్త ఫీచర్లతో వాట్సాప్ యూజర్లకు మెరుగైన అనుభవం అందించే ప్రయత్నం చేస్తోంది.
Read Also : Rozgar Mela : 71వేల మందికి అపాయింట్‌మెంట్ లెటర్‌లను పంపిణీ చేసిన ప్రధాని మోదీ