Site icon HashtagU Telugu

WhatssApp Update: వాట్పాప్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇకపై వాయిస్ ఒకసారి మాత్రమే వినగలం?

Mixcollage 11 Dec 2023 08 53 Pm 8507

Mixcollage 11 Dec 2023 08 53 Pm 8507

ప్రస్తుత రోజుల్లో రోజురోజుకీ వాట్సాప్ వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. వినియోగదారుల సంఖ్య పెరిగిపోతుండడంతో వాట్సాప్ సంస్థ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తూనే ఉంది. ఇప్పటికే ఎన్నో ఫీచర్ లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. తాజాగా కూడా మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది వాట్సాప్ సంస్థ.వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ వ్యూ వన్స్ అనే ప్రత్యేక ఫీచర్‌ను వినియోగదారుల కోసం తీసుకొచ్చింది.

అయితే వ్యూ వన్స్ ఫీచర్ ఇంతకు ముందు కూడా ఉందని, అయితే ఇది కేవలం ఫోటోలు,వీడియోల కోసం మాత్రమే. కానీ ఇప్పుడు ఇది వాయిస్ మెసేజ్ ల కోసం కూడా వస్తుంది వాట్సాప్. వ్యూ వన్స్ వాయిస్ మెసేజ్‌పై గ్రీన్ కలర్ లోగో ఉంటుంది, తద్వారా ఒకసారి వాయిస్ మెసేజ్ విన్న తర్వాత అది ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతుంది. వ్యూ వన్స్ వాయిస్ మెసేజ్‌ని ఒకసారి ఓపెన్ చేస్తే, అది దానంతట అదే డిలీట్ అవుతుంది. అది మళ్లీ వినబడదు. ఒకసారి చూసిన మెసేజ్ మరే వ్యక్తికి ఫార్వార్డ్ చేయబడదు. దానిని పంపిన వ్యక్తి కూడా ఇతరులకు ఫార్వార్డ్ చేయలేడు. ఇది చేయవలసి వస్తే, పంపినవారు ఆ మెసేజ్ ను మళ్లీ రికార్డ్ చేసి, దాన్ని షేర్ చేయాలి.

వాట్సాప్ అధికారిక బ్లాగ్ పోస్ట్ ప్రకారం, వ్యూ వన్స్ అని పంపిన వాయిస్ సందేశాలు పంపిన తర్వాత 14 రోజుల వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత తొలగించబడతాయి. సాధారణ వాయిస్ నోట్‌ల మాదిరిగా కాకుండా, పంపినవారు వారి వాయిస్ సందేశాలను పంపిన తర్వాత వాటిని వినలేరు. అయితే, పంపే ముందు ప్రివ్యూ చూసే అవకాశం ఉంది.