Site icon HashtagU Telugu

Whatsapp New Feature: వాట్సాప్ లో మరో అదిరిపోయే ఫీచర్.. స్టిక్కర్లను మీరే తయారు చేసుకోవచ్చు?

Whatsapp New Feature

Whatsapp New Feature

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా నిత్యం లక్షలాది మంది వినియోగదారులు చాటింగ్ కోసం వీడియో కాల్స్ ఇలా ఇతర అవసరాల కోసం ఉపయోగిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా రోజురోజుకీ స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్యతో పాటు వాట్సాప్ వినియోగదారుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. దీంతో వాట్సాప్ సంస్థ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తూనే ఉంది.

ఈ నేపథ్యంలోనే వాట్సాప్ సంస్థ తాజాగా మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. వాట్సాప్ కొత్త ఫీచర్ స్టిక్కర్ మేకర్ టూల్ పై పని చేస్తోంది. ఈ ఫీచర్‌ iOSలోని అప్లికేషన్‌లో స్టిక్కర్‌లను క్రియేట్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. కాగా చాట్ షేర్ యాక్షన్ షీట్‌లో కొత్త స్టిక్కర్ ఆప్షన్‌ను తీసుకురావాలని కంపెనీ ఆలోచిస్తోంది. ఈ ఫీచర్ వినియోగదారులు తమ లైబ్రరీ నుంచి ఫోటోలను ఎంచుకోవడానికి, బ్యాక్‌ గ్రౌండ్ తీసివేయడానికి అవకాశం కల్పిస్తుంది. పూర్తి ఎడిటింగ్ అవకాశాన్ని కూడా కల్పిస్తుంది.ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తే..

థర్డ్ పార్టీ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. వాట్సాప్ వెబ్, డెస్క్‌టాప్‌లో ఇప్పటికే ఈ సదుపాయం ఉందని, అయితే iOSలో డెవలప్ చేసిన టూల్ వినియోగదారులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని వాట్సాప్ యాజమాన్యం పేర్కొంది. యాప్‌లో స్టిక్కర్ మేకర్ సాధనాన్ని ఉపయోగించి స్టిక్కర్లను సృష్టించగల ఫీచర్ ప్రస్తుతం పురోగతిలో ఉందని, త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని తెలిపింది.

Exit mobile version