Site icon HashtagU Telugu

Whatsapp New Feature: వాట్సాప్ వాడుతున్నారా? మరో క్రేజీ ఫీచర్ వచ్చేసింది గురు!

Whatsapp New Feature

Whatsapp New Feature

యూజర్లకు ఎప్పటికప్పుడు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ అందించేందుకు ప్రయత్నిస్తున్న వాట్సాప్, తాజా అప్డేట్స్ ద్వారా యాప్ క్రేజ్‌ను మరింత పెంచుకుంటోంది. తాజాగా, మెన్షన్ ఫీచర్‌ను యాడ్ చేసి మెసేజింగ్ సర్వీస్ ప్లాట్‌ఫామ్ వినియోగదారులకు మరో క్రేజీ ఫీచర్ అందించింది. గత కొన్నాళ్లుగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న ఈ ఫీచర్, ఇప్పుడు వాట్సాప్‌లో కూడా అందుబాటులోకి రావడంతో వినియోగదారులు సంబరపడుతున్నారు. ఈ నేపథ్యంలో, స్టేటస్ మెన్షన్ ఫీచర్ గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ అప్‌లోడ్ చేసేటప్పుడు వినియోగదారులు మెన్షన్ ఫీచర్‌ను ఉపయోగించి, నచ్చిన వారిని ‘@’ ద్వారా ట్యాగ్ చేస్తారు. అలా ట్యాగ్ చేసిన వ్యక్తులకు మన స్టోరీ నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది, తద్వారా వారు మన స్టోరీని చూడగలుగుతారు. అలాంటి సదుపాయాన్ని ఇప్పుడు వాట్సాప్‌లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇకపై, వాట్సాప్‌లో స్టేటస్ అప్‌లోడ్ చేసే సమయంలో కాంటాక్ట్‌లలో నచ్చిన వారిని ట్యాగ్ చేయవచ్చు.

వాట్సాప్‌లో స్టేటస్ అప్‌లోడ్ చేసే సమయంలో “యాడ్ క్యాప్షన్స్” అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానికి కుడివైపున ‘@’ ఐకాన్ ఉంటోంది. ఈ ఐకాన్‌పై క్లిక్ చేస్తే, వాట్సాప్‌లోని అన్ని కాంటాక్ట్స్ జాబితా కనపడుతుంది. అందులో నచ్చిన వ్యక్తులను మెన్షన్ చేయవచ్చు, తద్వారా వారు స్టేటస్‌కు సంబంధించిన నోటిఫికేషన్ అందుకుంటారు. అయితే, ఇన్‌స్టాగ్రామ్ తరహాలో ట్యాగ్ చేసిన వ్యక్తి పేరు అందరికీ కనిపించదని వాట్సాప్ ఇప్పటికే ప్రకటించింది. యూజర్ల సీక్రెసీని కాపాడాలనే ఉద్దేశంతో మెసేజింగ్ యాప్ ఈ జాగ్రత్తలు తీసుకున్నది.