Site icon HashtagU Telugu

WhatsApp New Feature: వాట్సాప్ లో మరో సూపర్ ఫీచర్.. ఇకపై ఆ పని మరింత సులభం!

Whatsapp

Whatsapp

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది వాట్సాప్ ని వినియోగిస్తున్న విషయం తెలిసిందే. రోజు రోజుకీ ఈ వాట్సాప్ వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటికే ఎన్నో ఫీచర్లను తీసుకువచ్చిన వాట్సాప్ సంస్థ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను తీసుకువస్తూనే ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు మరో సరికొత్త ఫీచర్ ని తీసుకురాబోతోంది. మరి ఆ వివరాల్లోకి వెళితే.. కాగా గత నెలలో వాట్సాప్ వినియోగదారుల కోసం ప్రొఫైల్‌ కు సోషల్ మీడియా లింక్‌ లను జోడించడానికి ఒక ఫీచర్‌ ను అభివృద్ధి చేస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

ఈ ఫీచర్ వినియోగదారులకు వాట్సాప్ ఖాతా నుండే సోషల్ మీడియా ప్రొఫైల్‌ లను షేర్ చేసుకునే అవకాశాన్ని ఇవ్వబోతోంది. మీరు కూడా ఈ ఫీచర్ కోసం ఎదురు చూస్తుంటే మీకు మంచి సమాచారం అని చెప్పాలి. కంపెనీ ఇప్పుడు ఈ ఫీచర్‌ ను విడుదల చేస్తోంది? వాబేటా ఇన్ఫో వాట్సాప్ ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ 2.25.7.9 కోసం వాట్సాప్ బీటాలో గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉందని చూసింది. వాబేటా ఇన్ఫో ఈ ఫీచర్ స్క్రీన్‌షాట్‌ ను కూడా షేర్ చేసింది. ఈ స్క్రీన్‌షాట్‌ లో మీరు ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్‌ ను లింక్ చేసే ఎంపికను చూడవచ్చట. ప్రస్తుతం, ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ లింక్‌ ను జోడించే ఎంపిక మాత్రమే వాట్సాప్ లో ఉంది.

కొత్త అప్‌డేట్‌ లలో మరిన్ని సోషల్ మీడియా ఖాతాలను లింక్ చేసే ఎంపికను వాట్సాప్ ఇవ్వగలదని భావిస్తున్నారు. కాగా సోషల్ మీడియా ఖాతా లింక్ చాట్ సమాచార స్క్రీన్ లోపల కనిపించడం ప్రారంభమవుతుందట. తద్వారా ప్రజలు దానిని శోధించడంలో ఇబ్బంది పడరు. సెట్టింగ్‌ ల నుండి సోషల్ మీడియా లింక్‌ ల విజుబులిటి నిర్వహించే అవకాశాన్ని కూడా వాట్సాప్ వినియోగదారులకు అందిస్తోందట. యూజర్స్ తమ సోషల్ మీడియా లింక్‌ల విజుబులిటి Everyone, కాంటాక్ట్స్, నోబడీ, మై కాంటాక్ట్స్ నుండి ఎవరికైనా సెట్ చేయవచ్చట. ఈ కొత్త వాట్సాప్ ఫీచర్ ద్వారా యూజర్ల సోషల్ మీడియా ప్రొఫైల్‌ లను సులభంగా యాక్సెస్ చేయవచ్చట. ఈ కొత్త వాట్సాప్ ఫీచర్ పూర్తిగా ఐచ్ఛికం అని చెప్పాలి. యూజర్లు కోరుకుంటే వారు తమ వాట్సాప్ ప్రొఫైల్‌ కు సోషల్ మీడియా లింక్‌ లను జోడించవచ్చట. అయితే మీరు దీన్ని చేయకూడదనుకుంటే మీరు దానిని విస్మరించవచ్చట. బీటా టెస్టర్ల కోసం వారి స్వంత స్టేటస్ అప్‌డేట్‌ ల ఫోటోలు, వీడియోలను సేవ్ చేసే ఫీచర్‌ ను కూడా వాట్సాప్ అందుబాటులోకి తెచ్చిందట.