New Feature in Whats APP : వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచ‌ర్‌.. టెలిగ్రామ్‌కి పోటీగా ఇక‌నుంచి..

వాట్సాప్ వినియోగ‌దారుల‌కు మ‌రో గుడ్‌న్యూస్‌. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న ఫైల్ షేరింగ్ సైజ్ ప‌రిమితిని పెంచుతూ తాజాగా కొత్త అప్‌డేట్ తీసుకురావాల‌ని సంస్ధ నిర్ణ‌యించింది.

  • Written By:
  • Publish Date - March 28, 2022 / 01:57 PM IST

వాట్సాప్ వినియోగ‌దారుల‌కు మ‌రో గుడ్‌న్యూస్‌. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న ఫైల్ షేరింగ్ సైజ్ ప‌రిమితిని పెంచుతూ తాజాగా కొత్త అప్‌డేట్ తీసుకురావాల‌ని సంస్ధ నిర్ణ‌యించింది. ఇక‌పై పెద్ద పెద్ద ఫైల్స్‌ని కూడా పంపుకునేలా అప్‌డేట్ తీసుకురాబోతోంది. వాస్త‌వానికి వాట్సాప్‌లో ప్రస్తుతం 100 MB కన్నా ఎక్కువ సైజు ఉన్న ఫైల్స్‌ను షేర్ చేసుకోవడానికి వీలుకాదు. దీంతో పెద్ద సైజు ఉన్న మీడియా ఫైల్స్‌ను షేర్ చేయలేకపోతున్నామంటూ గత కొంత కాలంగా యూజర్లు పెద్ద సంఖ్యలో వాట్సాప్‌ దృష్టికి తీసుకొస్తున్నారు. యూజర్ల ఇబ్బందిని తొలగించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. త్వరలో దీని కోసం కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుందని వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వెల్లడించింది.

వాట్సాప్ పరిచయం చేయనున్న సరికొత్త ఫీచర్‌తో 2GB సైజు ఉన్న మీడియా ఫైల్స్‌ను సైతం పంపుకోవచ్చు.. ప్రస్తుతం వాట్సాప్ పరీక్షల దశలో ఉంది. త్వరలో కొత్త ఫీచర్‌ను వాట్సాప్ అందుబాటులోకి తేనుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న సెల్ ఫోన్‌ల కెమెరాలు అధిక సామర్థ్యం కలిగి ఉన్నాయి. అధిక సామర్థ్యంతో చిత్రీకరించే ఫోటో.. వీడియో హై క్వాలిటీతో స్టోర్ అవుతున్నాయి.

ఆ ఫైల్ సైజు ఎక్కువగా ఉండడంతో షేర్ చేసుకోవడానికి వీలు కావడం లేదు. యూజర్ల అభ్యర్థన మేరకు వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ను తీసుకువస్తున్నట్టు తెలుస్తోంది. కొత్త వాట్సాప్ ఫీచర్‌లో మీడియా ఫైల్ షేరింగ్ ఫైల్ సైబు లిమిట్ 2GBకి పెంచనుంది.