Site icon HashtagU Telugu

WhatsApp: వాట్సాప్ లో మరో ఫీచర్ .. డిలీట్ చేసిన మెసేజ్లను తిరిగి సేవ్ చేసుకోండిలా?

Whatsapp

Whatsapp

దేశవ్యాప్తంగా నిత్యం లక్షలాదిమంది ఉపయోగిస్తున్న సోషల్ మీడియా యాప్స్ లో ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కూడా ఒకటి. కొందరు అయితే ఉదయం లేచిన దగ్గర్నుంచి పడుకునే వరకు వాట్సాప్ లోనే కాలక్షేపం చేస్తూ ఉంటారు. వాట్సాప్ సంస్థ వినియోగదారుల కోసం ఇప్పటికే ఎన్నో రదేశవ్యాప్తంగా నిత్యం లక్షలాదిమంది ఉపయోగిస్తున్న సోషల్ మీడియా యాప్స్ లో ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్కాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో సరికొత్త ఫీచర్ ని కూడా అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధపడుతోంది వాట్సాప్ సంస్థ. కాగా వాట్సాప్ కెప్ట్ అనే కొత్త ఫీచర్ ను డెవలప్ చేయబోతోంది.

ఈ ఫీచర్ ద్వారా డిలీట్ చేసిన మెసేజ్‌లను సేవ్ చేసుకోవచ్చు. ఈ సరికొత్త ఫీచర్ ఇంకా బీటా వినియోగదారులకు కూడా అందుబాటులో లేదు. త్వరలోనే మనందరికి అందుబాటులోకి రాబోతోంది. కొంతమంది వాట్సాప్ యూజర్లు డిలీట్ చేసిన మెసేజ్ ఫీచర్‌ని ఉపయోగిస్తున్నారు. ఇది 24 గంటలు, 7 రోజులు, 90 రోజులలో మెసెజ్‌లను ఆటో డిలీట్ చేసే ఆప్షన్ ఉంటుంది. ఈ విధంగా వాట్సాప్‌లో వారు పంపిన మెసేజ్‌లు వాటంతట అవే అదృశ్యమవుతాయి. వారి వ్యక్తిగత గోప్యతను కాపాడతాయి. అయితే వాట్సాప్ ఇప్పుడు కెప్ట్ అనే ఫీచర్‌ని తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. ఈ ఫీచర్ ఇది డిలీట్ చేసిన మెసెజ్‌లను ఆటో సేవ్ చేస్తుంది.

అలాగే కనిపించకుండాపోయిన మెసేజ్ లను సేవ్ చేయడానికి సేవ్డ్ మెసేజెస్ ఫీచర్ ఒక మార్గం అని చెప్పవచ్చు. అయితే వినియోగదారులు సందేశాలను రిజర్వ్ చేయకూడదనుకుంటే వారు వాటిని అన్-రిజర్వ్ చేయవచ్చు. మెసేజ్‌లు అన్ రిజర్వ్ చేయబడిన వెంటనే. అవి చాట్‌లో కనిపించవు ఫీచర్ ద్వారా సేవ్ చేయబడిన మెసెజ్‌లు వాటి పక్కన ఉన్న బుక్‌మార్క్ సింబల్ ద్వారా గుర్తించబడతాయి. వాట్సాప్ కొత్త వెర్షన్‌లో ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది వాట్సాప్ సంస్థ.