WhatsApp new Feature: వాట్సాప్ వినియోగదారులకు సూపర్ గుడ్ న్యూస్.. అదేమిటంటే?

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. నిత్యం కోట్లాదిమంది ఈ వాట్సాప్ ను వినియోగిస్తూనే

  • Written By:
  • Publish Date - November 22, 2022 / 07:04 PM IST

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. నిత్యం కోట్లాదిమంది ఈ వాట్సాప్ ను వినియోగిస్తూనే ఉన్నారు. అయితే రోజురోజుకీ వాట్సాప్ వినియోగదారుల సంఖ్య పెరిగిపోతుండడంతో వాట్సాప్ సంస్థ వారు కూడా అనేక రకాల ఫీచర్ లను అందుబాటులోకి తీసుకు వస్తున్నారు. ఇప్పటికీ ఎన్నో రకాల ఫ్యూచర్లను అందుబాటులోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఆండ్రాయిడ్ ఐవోఎస్ వినియోగదారుల కోసం కొత్త ఆప్షన్లను తీసుకువచ్చిన వాట్సాప్ సంస్థ ఇప్పుడు వెబ్ వినియోగదారులకు కూడా అనేక రకాల ఆప్షన్లను తీసుకువస్తోంది.

కాగా త్వరలోనే డెస్క్‌టాప్‌ లో వాట్సాప్ వినియోగదారులకు స్క్రీన్ లాక్ చేసే కొత్త ఫీచర్ ను అందించనున్నట్లు ప్రకటించింది వాట్సాప్ సంస్థ. వాట్సాప్ వినియోగదారుల ప్రైవసీ విషయంలో భాగంగానే మరొక అడుగు ముందుకు వేసిన వాట్సాప్ సంస్థ వాట్సాప్ వెబ్లో స్క్రీన్ లాక్ అనే కొత్త ఫ్యూచర్ ను తీసుకురాబోతోంది. వెబ్ ఆప్షన్‌లో వాట్సాప్‌ను తెరిచిన ప్రతిసారీ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది వినియోగదారులు తమ డెస్క్‌టాప్‌లో ఉపయోగించనప్పుడు ఇతరులు వారి వాట్సాప్‌ను అనధికారికంగా ఉపయోగించకుండాఈ ఫీచర్ కాపాడుతుంది. అయితే ఈ స్క్రీన్ లాక్ ఫీచర్‌ని వినియోగదారులు వాళ్లకు కావాలి అనుకున్నప్పుడు ఉపయోగించుకోవచ్చు.

అదేవిధంగా వాట్సాప్ ఆండ్రాయిడ్ ఐఓఎస్ వినియోగదారుల కోసం మిస్డ్ కాల్ అలర్ట్ అనే కొత్త ఫీచర్ ని కూడా విడుదల చేయబోతోంది. ఎప్పుడైనా స్మార్ట్ ఫోన్ డోంట్ డిస్టర్బ్ మోడ్ లో ఉన్నప్పుడు ఎవరైనా మీకు వాట్సాప్ లో కాల్ చేస్తే ఈ ఆప్షన్ ను మీకు రిమైండ్ చేస్తుంది. అయితే ఎప్పుడైనా మీరు అనుకోకుండా కాల్ మిస్ చేసినట్లయితే ఈ ఫ్యూచర్ మీకు సమాచారం తెలుపుతుంది. ఇప్పటికే ఈ ఫీచర్ ని తీసుకురావడానికి వాట్సాప్ సంస్థ అంతా సిద్ధం చేసింది. కాగా ఈ ఫీచర్లు తాజా బీటా వెర్షన్ 2.22.24.7లో అందుబాటులో ఉంటాయి. ఈ ఫీచర్లను ఇప్పటికే కొంతమంది బీటా వాట్సాప్ యూజర్లకు పరిచయం చేసింది వాట్సాప్ సంస్థ.