Site icon HashtagU Telugu

Whats App Update: వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త.. ఇకపై నెంబర్ కనపడకుండానే మెసేజ్?

Whats App Update

Whats App Update

రోజురోజుకీ వాట్సాప్ వినియోగదారుల సంఖ్య పెరిగిపోతుండడంతో వాట్సాప్ సంస్థ కూడా ఒకదాని తర్వాత ఒకటి వరుసగా అప్డేట్లను విడుదల చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది వాట్సాప్ సంస్థ. తాజాగా వాట్సాప్‌ తన ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ వినియోగదారుల కోసం ఫోన్ నంబర్ గోప్యత అనే కొత్త ఫీచర్‌ను విడుదల చేయనుంది. అయితే ప్రస్తుతం ఈ అప్‌డేట్‌ బీటా వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. తాజా బీటా అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత వినియోగదారులు కమ్యూనిటీ అనౌన్స్‌మెంట్ గ్రూప్ సమాచారంలో ఫోన్ నంబర్ గోప్యత అనే కొత్త ఎంపికను చూడవచ్చు.

మరి ఈ నెంబర్ గొప్యత గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. వాట్సాప్‌ కమ్యూనిటీలో వారి ఫోన్ నంబర్‌లను దాచడం ద్వారా వారి గోప్యతను నిర్వహించడానికి ఈ ఫీచర్ సహాయపడుతుంది. ఈ ఫీచర్‌తో వారి ఫోన్ నంబర్ కమ్యూనిటీ అడ్మిన్‌లకు వారిని కాంటాక్ట్‌గా సేవ్ చేసుకున్న ఇతర వ్యక్తులకు మాత్రమే కనిపిస్తుంది. సంభాషణలో పాల్గొనే ఇతర వ్యక్తుల నుండి వారి పూర్తి ఫోన్ నంబర్‌లను దాచడానికి కూడా ఇది వినియోగదారులకు సహాయపడుతుంది. అయితే, ఫీచర్ కేవలం కమ్యూనిటీ సభ్యులకు మాత్రమే పరిమితం చేశారు.

అలాగే కమ్యూనిటీ అడ్మిన్ ఫోన్ నంబర్ ఎల్లప్పుడూ కనిపిస్తుంది. అయితే ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ బీటా వినియోగదారులకు అందుబాటులో ఉన్న ఈ అప్‌డేట్‌ భవిష్యత్‌లో సాధారణ వినియోగదారులకు కూడా అందుబాటులోకి వస్తుందట. ఇలా వాట్సాప్ సంస్థ వినియోగదారులను ఆకర్షించుకోవడం కోసం ఒకదాని తర్వాత ఒకటి వరుస అప్డేట్లను విడుదల చేస్తుండడంతో వాట్సాప్ వినియోగదారుల సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతూనే ఉంది.

Exit mobile version