Site icon HashtagU Telugu

WhatsApp Translator : ‘వాట్సాప్‌ ట్రాన్స్‌లేటర్’ వస్తోంది.. ఎలా పనిచేస్తుందో తెలుసా ?

Whatsapp Translator Whatsapp Translate Chat Messages Feature

WhatsApp Translator : యూజర్లకు సరికొత్త ఫీచర్లను అందించే విషయంలో వాట్సాప్ చాలా ముందుంది. మరో అద్భుతమైన ఫీచర్‌ను వాట్సాప్ తీసుకొస్తోంది. దాని పేరే.. ‘వాట్సాప్ ట్రాన్స్‌లేటర్’. మనకు వాట్సాప్‌లో ఇతర భాషల్లో వచ్చే మెసేజ్‌లను వెంటనే.. నచ్చిన భాషలలోకి మార్చేసే వెసులుబాటును కల్పించడమే ఈ ఫీచర్ ప్రత్యేకత. వాట్సాప్ ఛాట్స్‌తో పాటు వాట్సాప్ ఛానల్స్‌లో కూడా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తేనున్నారు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను వాట్సాప్‌కు చెందిన ఆండ్రాయిడ్‌ బీటా వర్షన్‌ 2.24.26.9లో టెస్ట్ చేస్తున్నారు.

Also Read :Mark Zuckerberg : ట్రంప్‌కు రూ.8వేల కోట్లు ఇచ్చుకున్న ఫేస్‌బుక్ అధినేత.. ఎందుకు ?

ఇంతకుముందు వరకు వాట్సాప్‌లో మనకు అర్థం కాని భాషలో ఏదైనా మెసేజ్‌ వస్తే.. దాన్ని కాపీ చేసి  గూగుల్ ట్రాన్స్‌లేట్‌లో(WhatsApp Translator) వేసి తర్జుమా చేసుకునే వాళ్లం. ఇకపై ఆ అవసరం ఉండదు. ఎందుకంటే వాట్సాప్‌లోనే ట్రాన్స్‌లేట్ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. ప్రత్యేకించి ఇంగ్లిష్, హిందీ భాషలలో వచ్చే మెసేజ్‌లు చదవడానికి తెలుగు రాష్ట్రాల గ్రామీణ యూజర్లు ఇబ్బందిపడుతుంటారు. అలాంటి వారికి ఈ ఫీచర్ ఒక టెక్ వరంగా పరిణమించనుంది. మెసేజ్‌ ట్రాన్స్‌లేట్ అయినంత మాత్రాన సంబరపడిపోకుండా.. దాన్ని ఒకటికి, రెండుసార్లు చెక్ చేసుకున్నాకే దాన్ని అర్థం చేసుకుంటే బెటర్. ప్రత్యేకించి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి వచ్చే మెసేజ్‌ల విషయంలో వాట్సాప్ యూజర్లు అలర్ట్ మోడ్‌లో ఉండాలి.

Also Read :600 Diamonds Crown : స్వామివారిపై ముస్లిం డ్యాన్సర్ భక్తి.. 600 వజ్రాలతో కిరీటం

వాట్సాప్ ట్రాన్స్‌లేట్ ఫీచర్‌కు కూడా ఎండ్‌-టు -ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ ఉంటుంది. అంటే మనం ట్రాన్స్‌లేట్ చేసే మెసేజ్‌ల సమాచారం థర్డ్ పార్టీ సర్వర్ల‌లోకి, వాట్సాప్ సర్వర్లలోకి వెళ్లదు. ఇంకో విశేషం ఏమిటంటే.. మనకు ఇంటర్నెట్ కనెక్షన్ లేకున్నా, ఆఫ్‌లైన్ మోడ్‌లో ఉన్నా..  వాట్సాప్‌లోని మెసేజ్‌లను ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చట. వాట్సాప్ యూజర్లు ప్రతీ మెసేజ్‌ను ట్రాన్స్‌లేట్ చేయరు. అవసరమైన వాటిని మాత్రమే అనువదించి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు.

Also Read :Sonakshi Sinha Pregnant : ప్రెగ్నెంట్ వార్తలను ఖండించిన సల్మాన్ హీరోయిన్