WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త.. ఇక మీదట వేరే యాప్ లకు కూడా మెసేజ్లు సెండ్ చేయవచ్చట?

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిత్యం కోట్లాది మంది ఉపయోగిస్తున్న మెసేజ

  • Written By:
  • Publish Date - March 5, 2024 / 03:30 PM IST

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిత్యం కోట్లాది మంది ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్స్ లో వాట్సాప్ ముందు వరుసలో ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక వాట్సాప్ వినియోగదారుల సంఖ్య రోజుకి పెరుగుతూనే ఉండడంతో వినియోగదారులను మరింత ఆకర్షించడం కోసం వాట్సాప్ సంస్థ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తూనే ఉంది. కాగా ఇప్పటికే పదుల సంఖ్యలో కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేసిన వాట్సాప్ సంస్థ ఇప్పుడు వినియోగదారుల కోసం మరో సరికొత్త ఫీచర్ ని తీసుకొచ్చింది.

త్వరలోనే కొత్త చాట్ ఇంటర్‌ఆపరబిలిటీ ఫీచర్‌తో సిగ్నల్ లేదా టెలిగ్రామ్ వంటి థర్డ్‌ పార్టీ యాప్‌లకు మెసేజ్‌లు పంపించే ఆప్షన్‌ అందించనుంది. యూరప్ డిజిటల్ మార్కెట్స్ యాక్ట్ నిబంధనలకు ప్రతిస్పందనగా కొత్త ఫీచర్‌ను వాట్సాప్‌ తీసుకురానుంది. ఈ యాక్ట్ వివిధ మెసేజింగ్ యాప్‌ల మధ్య కమ్యూనికేషన్‌ను సులభతరం చేయడానికి పెద్ద కంపెనీలకు లేదా గేట్‌కీపర్‌లకు ఆరు నెలల సమయం ఇస్తుంది. కాగా వాట్సాప్ బీటా ఇన్ఫో నివేదిక ప్రకారం.. వాట్సాప్‌ థర్డ్-పార్టీ చాట్స్ కోసం కొత్త సెక్షన్‌లో పని చేస్తోంది. ఇది ప్రస్తుతం వాట్సాప్‌ బీటా వెర్షన్ 2.24.5.18లో అందుబాటులో ఉంది. వాట్సాప్‌ బిల్డ్ వెర్షన్ 2.24.5.18. వాట్సాప్ బీటా ఇన్‌ఫో నుంచి లీకైన స్క్రీన్‌షాట్ చాట్ ఇంటర్‌ఆపెరాబిలిటీ ఫీచర్ ఆప్ట్‌-ఇన్ ఫీచర్ అని చూపిస్తుంది. అంటే వినియోగదారులు దీన్ని ఉపయోగించడానికి మాన్యువల్‌గా ఫీచర్‌ను ఎనేబుల్‌ చేసుకోవాలి.కాగా ఈ ఫీచర్‌ను ఆన్ చేయడానికి ముందే, వాట్సాప్‌ 3 జాగ్రత్తలను సూచిస్తుంది.

మొదటిది.. మీరు వాట్సాప్‌ కాకుండా ఇతర అప్లికేషన్‌కు మెసేజ్‌ పంపుతున్నారు. థర్డ్-పార్టీ యాప్‌లు వేర్వేరు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ని కలిగి ఉండవచ్చు. రెండో జాగ్రత్తలో..థర్డ్-పార్టీ చాట్‌లలో స్పామ్, స్కామ్‌లు ఎక్కువగా ఉండవచ్చు. మూడోది.. థర్డ్‌ పార్టీ యాప్‌లు వాటి సొంత పాలసీలను కలిగి ఉంటాయి. వారు మీ డేటాను వాట్సాప్ కంటే భిన్నంగా హ్యాండిల్‌ చేయవచ్చు అని సూచిస్తుంది. కొత్త చాట్ ఇంటర్‌ఆపరబిలిటీ ఫీచర్ ద్వారా టెలిగ్రామ్ లేదా సిగ్నల్ వంటి మరొక సర్వీసును ఉపయోగిస్తున్న వారికి కూడా మెసేజ్‌ చేయవచ్చు. అయితే, ఈ చాట్‌లు సెపరేట్‌ ఇన్‌బాక్స్‌లోని చాట్స్ ట్యాబ్ కింద లిస్టు అవుతాయని WaBetaInfo తెలిపింది. వాట్సాప్‌ కంపెనీ ఇంజినీరింగ్ డైరెక్టర్ డిక్ బ్రౌవర్ కూడా ఇటీవలే వైర్డ్ మ్యాగజైన్‌కి ఈ విషయాలను ధృవీకరించారు. యూరోపియన్‌ యూనియన్‌ డిజిటల్ మార్కెట్స్ యాక్ట్ నిబంధనలకు అనుగుణంగా చాట్ ఇంటర్‌ఆపరబిలిటీ ఫీచర్ త్వరలో వాట్సాప్‌లోకి రానుందని స్పష్టం చేశారు. అయితే ఇంటర్‌ఆపరబుల్ చాట్‌లు ప్రారంభ దశలో టెక్స్ట్ మెసేజ్‌లు, ఇమేజ్‌లు, వాయిస్ మెసేజ్‌లు, వీడియోలపై మాత్రమే దృష్టి పెడతాయి. కాల్‌లు, గ్రూప్ చాట్‌లు వంటి ఫీచర్‌లు ఇంటర్‌ఆపరబుల్ చాట్‌లుగా మారడానికి సంవత్సరాలు పట్టవచ్చని నివేదిక పేర్కొంది.