Site icon HashtagU Telugu

WhatsApp Custom Stickers: వాట్సాప్‌ యూజర్స్ కి గుడ్ న్యూస్..ఇక మీదట వాటిని అందరికి షేర్ చేయవచ్చట!

WhatsApp New Feature

WhatsApp New Feature

ప్రస్తుత రోజుల్లో రోజుకి వాట్సాప్ వినియోగదారుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. నిత్యం కోట్లాది ఈ వాట్సాప్ ని వినియోగిస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే ఎన్నో రకాల ఫీచర్లను తీసుకువచ్చిన వాట్సాప్ సంస్థ ఇప్పుడు త్వరలోనే మరో సరికొత్త ఫీచర్ ని తీసుకురాబోతోంది. ఇంతకీ ఆ ఫీచర్ ఏంటి? ఎలా పని చేస్తుంది అన్న వివరాల్లోకి.. ఈ ఫీచర్ ప్రస్తుతం బీటా టెస్టింగ్ దశలో ఉంది. గూగుల్ ప్లే స్టోర్‌ లో అందుబాటులో ఉన్న లేటెస్ట్ వాట్సాప్ బీటా అప్‌డేట్ వెర్షన్ 2.24.25.2 ద్వారా ఆండ్రాయిడ్ యూజర్లు ఎంచుకోవచ్చు. కస్టమ్ స్టిక్కర్ ప్యాక్‌ లను క్రియేట్ చేయవచ్చు.

అలాగే బీటా టెస్టర్‌ లు మొత్తం స్టిక్కర్ ప్యాక్‌ లను వారి కాంటాక్టులతో షేర్ చేయవచ్చు. అయితే టెస్టింగ్ తర్వాత ఈ ఫీచర్ త్వరలో మరింత మంది యూజర్లకు అందుబాటులో ఉంటుందని సూచిస్తున్నారు. ఇకపోతే ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది అన్న విషయానికి వస్తే.. వినియోగదారులు ఏ చాట్‌ లోనైనా స్టిక్కర్ ప్యాక్ ను ఓపెన్ చేయవచ్చు. ప్రతి స్టిక్కర్ ప్యాక్ పక్కన కొత్త త్రి డాట్స్ మెను ఆప్షన్ గుర్తించగలరు. ఈ మెను రెండు ఆప్షన్లను అందిస్తుంది. స్టిక్కర్ ప్యాక్‌ ను షేరింగ్ చేయడం లేదా వారి వ్యక్తిగత లైబ్రరీ నుంచి తొలగించడం, షేర్ ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా వినియోగదారులు మరింత సులభంగా స్టిక్కర్ ప్యాక్‌ లను స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా గ్రూప్ చాట్‌ లకు పంపవచ్చట.

వాట్సాప్ ద్వారా క్రియేట్ చేసిన ఫస్ట్-పార్టీ స్టిక్కర్ ప్యాక్‌ల కోసం షేరింగ్ అధికారిక స్టిక్కర్ స్టోర్‌కు నేరుగా లింక్‌ను రూపొందిస్తుంది. ఈ ప్రక్రియ రిసీవర్లు ఇప్పటికే ఆన్‌లైన్‌లో హోస్ట్ చేసిన స్టిక్కర్‌లను వాట్సాప్ మళ్లీ అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేకుండా స్టోర్ నుంచి ప్యాక్‌ను డౌన్‌లోడ్ చేసేందుకు అనుమతిస్తుంది. అదే సమయంలో, థర్డ్-పార్టీ స్టిక్కర్ ప్యాక్‌లను నేరుగా అప్‌లోడ్ చేయవచ్చు. కాంటాక్టులు లేదా గ్రూపులతో షేరింగ్ చేయవచ్చు, కస్టమైజడ్ స్టిక్కర్ సెట్‌లను క్రియేట్ చేయడం లేదా కలెక్ట్ చేసే యూజర్లకు ప్రయోజనకరంగా ఉంటుందట.