వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్.. రెండు రోజుల తర్వాత కూడా అలా డిలీట్ చెయ్యచ్చు?

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. నిత్యం ఈ వాట్సాప్ ను కోట్లాదిమంది ఉపయోగిస్తూనే

  • Written By:
  • Publish Date - July 17, 2022 / 09:00 AM IST

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. నిత్యం ఈ వాట్సాప్ ను కోట్లాదిమంది ఉపయోగిస్తూనే ఉన్నారు. వాట్సాప్ సంస్థ వారు కూడా వినియోగదారుల కోసం తరచుగా అదే పోయే ఫ్యూచర్లను అందుబాటులోకి తీసుకుని వస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ వాట్సాప్ లో ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్ లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. తాజాగా zeiమరో సరికొత్త ఫ్యూచర్ ని అందుబాటులోకి తీసుకొని వచ్చింది. వాట్సాప్ లో మనం ఒకరికి పంపించిన సందేశాలను తిరిగి డిలీట్ అవకాశం ఉంటుంది.

అందులో ఒకటి డిలీట్ ఫర్ మీ అని ఇంకొకటి డిలీట్ ఫర్ ఎవరీ వన్. కాగా మనం మెసేజ్ ను డిలీట్ చేయడానికి కూడా సమయం పరిమితి ఉంది. కొంత సమయం తర్వాత దాన్ని తీసేయాలని అనిపించొచ్చు. అప్పటికే సమయం మించి పోయిందంటే? ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే ఈ సమయాన్ని మరింత అధికంగా ఇవ్వాలని వాట్సాప్ భావిస్తోంది. త్వరలోనే ఈ సౌకర్యం వినియోగదారులకు అమల్లోకి రానుంది. ప్రస్తుతం ఒక మెసేజ్ పంపిన తర్వాత గంట 1 గంట 8 నిమిషాల, 16 సెకండ్ల వరకు డిలీట్ చేయవచ్చు.

కానీ మెసేజ్ పంపించిన రెండు రోజుల తర్వాత కూడా వాటిని తొలగించుకునే ఆప్షన్ ఇవ్వాలని వాట్సాప్ ప్రణాళికతో ఉంది. ఐవోఎస్ వెర్షన్ వాట్సాప్ పై ఈ ఫీచర్ ను ప్రస్తుతం పరీక్షించి చూస్తోంది. అలాగే, గ్రూప్ లో సభ్యులు పోస్ట్ చేసిన వాటిని అడ్మిన్ లు శాశ్వతంగా డిలీట్ చేసే ఆప్షన్ ను సైతం వాట్సాప్ అభివృద్ధి చేస్తోంది. త్వరలోనే ఈ రెండు ఫీచర్ లను అందుబాటులోకి తీసుకొని రావడానికి వాట్సాప్ సంస్థ వారు పరీక్షలు నిర్వహిస్తున్నారు.