WhatsApp Theme Color : వాట్సాప్ రంగులమయం కాబోతోంది. త్వరలోనే మనం వాట్సాప్ థీమ్‌ను మనకు నచ్చిన రంగులోకి మార్చుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మనం వాట్సాప్‌లో కేవలం లైట్, డార్క్ మోడ్‌లను మాత్రమే మార్చుకోగలుగుతున్నాం. అయితే వాట్సాప్ బ్రాండింగ్ రంగు అయిన ప్రైమరీ గ్రీన్ కలర్ మాత్రం మారడం లేదు. త్వరలో రాబోయే ‘యాప్ కలర్’ ఫీచర్ ఈ ప్రాబ్లమ్‌కు పరిష్కారాన్ని చూపబోతోంది. గ్రీన్, బ్లూ, వైట్, పింక్, పర్పుల్ కలర్ ఆప్షన్లు మనకు అందుబాటులోకి వచ్చేస్తాయి. వాటితో మన వాట్సాప్ లుకింగ్ మారిపోతుంది. ఇక చాట్ విండోలో బబుల్ రంగును కూడా మార్చేయొచ్చు. ఆ తర్వాత క్రమంగా మరిన్ని రంగులను ‘యాప్ కలర్’ విభాగంలో వాట్సాప్ జోడిస్తుంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది. వాట్సాప్ ఐవోఎస్ బీటా వెర్షన్ 24.1.10.70లో ‘యాప్ కలర్’ ఫీచర్‌ను టెస్ట్ చేస్తున్నారు. అయితే దీన్ని ఇంకొన్ని రోజుల్లో ఆండ్రాయిడ్ యూజర్లకు సైతం టెస్టింగ్ కోసం అందుబాటులోకి తెచ్చే ఛాన్స్(WhatsApp Theme Color) ఉంది.
We’re now on WhatsApp. Click to Join.
వాట్సాప్‌లో త్వరలో మనకు యూజర్ నేమ్ ఫీచర్ తీసుకురాబోతోంది. అంటే మన ఫోన్ నంబర్ ప్లేస్‌లో యూజర్ నేమ్ కనిపిస్తుంది. యూజర్ నేమ్ ఉండడం వల్ల ఎవరైనా మనల్ని సులువుగా గుర్తుపడతారు. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది. యూజర్ నేమ్ వల్ల యూజర్ల వ్యక్తిగత భద్రతకు, ప్రైవసీకి ఆటంకం కలగదు. ఫోన్ నంబర్ల కంటే, యూజర్ నేమ్స్ షేర్ చేయడం చాలా ఈజీ. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో యూజర్లను కనెక్ట్ చేసుకునేందుకు మార్గం సుగమం అవుతుంది.
Also Read: Arjuna Awards : చిరాగ్ శెట్టి, రంకిరెడ్డిలకు ఖేల్ రత్న.. షమీ, అజయ్ కుమార్‌లకు అర్జున ప్రదానం
మరో అద్భుతమైన కొత్త అప్‌డేట్‌ను వినియోగదారులకు వాట్సాప్ అందించనుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు వీడియో కాల్ కనెక్ట్ అయిన సమయంలో మ్యూజిక్ ఆడియోను షేర్ చేసుకునేందుకు వీలవుతుంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ను బీటా వినియోగదారులతో పరీక్షిస్తున్నారు. వీడియో కాల్‌లో ఉన్నవారు తమ స్క్రీన్ షేర్ చేసినప్పుడు, వారి మొబైల్‌లో ప్లే చేసే ఆడియో మరొకరికి కూడా షేర్ అవుతుంది. ఈ ఫీచర్ ఒకరికొకరు కాల్‌లో ఉన్న సమయంలోనే కాకుండా గ్రూప్ వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు కూడా వాడుకోవచ్చు. ఈ ఫీచర్‌ను మరికొద్ది వారాల్లోనే అందుబాటులోకి తీసుకురావాలని వాట్సాప్ భావిస్తోంది. మొత్తం మీద న్యూ ఇయర్‌లోనూ వాట్సాప్ కొత్త ఫీచర్లతో దూసుకుపోతోంది.