Chat Lock : వాట్సాప్ ఛాట్స్‌‌ను లాక్ చేసేందుకు ‘సీక్రెట్ కోడ్’

Chat Lock : వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ వచ్చింది. వాట్సాప్ ఛాట్స్‌ను లాక్ చేసేందుకు ఒక సీక్రెట్ కోడ్‌ను జనరేట్ చేయడమే కొత్త ఫీచర్ ప్రత్యేకత. 

Published By: HashtagU Telugu Desk
Chat Lock

Chat Lock

Chat Lock : వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ వచ్చింది. వాట్సాప్ ఛాట్స్‌ను లాక్ చేసేందుకు ఒక సీక్రెట్ కోడ్‌ను జనరేట్ చేయడమే కొత్త ఫీచర్ ప్రత్యేకత.  ఇక మీరు మీ వాట్సాప్ ఛాట్స్‌కు లాక్ వేసేందుకు ఈ సీక్రెట్ కోడ్‌ను వాడొచ్చు. ఇలా సీక్రెట్ కోడ్‌‌తో దాచిపెట్టే వాట్సాప్ ఛాట్స్‌ను మళ్లీ చూడాలంటే.. సెర్చ్ బార్‌లో ఆ సీక్రెట్ కోడ్‌ను తప్పకుండా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే సీక్రెట్ కోడ్‌తో లాక్ చేసిన ఛాట్స్ కనిపిస్తాయి. లాక్ చేసిన వాట్సాప్ ఛాట్స్ రక్షణ కోసం అదనపు లేయర్‌గా ఈ సీక్రెట్ కోడ్ పనిచేస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ ఫీచర్‌ ఉపయోగించడం ఇలా..

  • మీ మొబైల్‌లో WhatsApp తెరవండి.
  • ఏదైనా వాట్సాప్ ఛాట్‌ను ఎంపిక చేసి లాక్ చేయండి.
  • అనంతరం లాక్ చేసిన ఛాట్‌లను హైడ్ చేయండి.
  • ఇలా హైడ్ చేసిన వాట్సాప్ ఛాట్‌లలో ఒకటి లేదా కొన్ని ఎంపిక చేసి.. వాటిని యాక్సెస్ చేయడానికి ఒక సీక్రెట్ కోడ్‌ను సెట్ చేసుకోండి.
  • అనంతరం.. మీరు సీక్రెట్ కోడ్‌తో హైడ్ చేసిన ఛాట్‌లు వాట్సాప్ మెయిన్ ఛాట్ విండోలో కనిపించవు.
  • దాచిన, లాక్ చేసిన వాట్సాప్ చాట్‌లను చూడాలని భావిస్తే.. సెర్చ్ బార్‌లో సీక్రెట్ కోడ్‌ను(Chat Lock) ఎంటర్ చేయండి.
  Last Updated: 01 Dec 2023, 11:05 AM IST