Site icon HashtagU Telugu

WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త.. రెండు సరికొత్త ఫీచర్స్ రిలీజ్?

Whatsapp

Whatsapp

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిత్యం లక్షలాది మంది వినియోగదారులు చాటింగ్ కోసం, వీడియో కాల్స్ ఇతర అవసరాల కోసం వాట్సాప్ ని ఉపయోగిస్తూనే ఉంటారు. అంతేకాకుండా రోజురోజుకీ స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్యతో పాటు వాట్సాప్ వినియోగదారుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. దీంతో వాట్సాప్ సంస్థ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా వాట్సాప్ సంస్థ మరో రెండు సరికొత్త ఫీచర్ లను అందుబాటులోకి తీసుకువచ్చింది.

తాజాగా వీడియో కాల్స్ కోసం స్క్రీన్ షేర్, ల్యాండ్‌స్కేప్ మోడ్ అనే రెండు కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. ప్రస్తుతం ఈ రెండు ఫీచర్లు ఐఫోన్లు, ఆండ్రాయిడ్ఫోన్లు, విండోస్ డివైజ్‌లలో అందుబాటులో ఉన్నాయి. ఈ కొత్త స్పెషఫికేషన్స్ రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో వినియోగదారులందరికీ అందుబాటులోకి రానున్నాయి. వాట్సప్‌లో అందించిన కొత్త స్క్రీన్ షేరింగ్ ఫీచర్‌తో యూజర్లు కాల్ సమయంలో వారి లైవ్ స్క్రీన్‌ను కాల్‌లో జాయిన్ అయిన అవతలి వ్యక్తికి చూపించవచ్చు. షేర్ ఐకాన్ క్లిక్ చేసి యాప్‌ను లేదా మొత్తం స్క్రీన్‌ను షేర్ చేయవచ్చు. కొత్త అప్‌డేట్ యూజర్లు వీడియో కాల్స్‌లో మాట్లాడుతున్న వ్యక్తులతో డాక్యుమెంట్స్‌, ఫొటోలు, వీడియోలను షేర్ చేయడానికి వీలు కల్పిస్తోంది.

వర్క్ కోసం డాక్యుమెంట్స్ షేర్ చేయడానికి, కుటుంబసభ్యులతో కలిసి ఫ్యామిలీ ఫొటోలు చూడటానికి, హాలిడే ప్లానింగ్ వేయడానికి, కలిసి షాపింగ్ చేయడానికి లేదా లైవ్‌లో టెక్నికల్ సపోర్ట్ అందించడానికి ఈ ఫీచర్‌ను వినియోగించవచ్చని మెటా సంస్థ వెల్లడించింది. ఇకపోతే స్క్రీన్ ఎలా షేర్ చేయాలి? అన్న విషయానికి వస్తే.. వాట్సాప్ ఓపెన్ చేసి, స్క్రీన్‌ని షేర్ చేయాలనుకుంటున్న వ్యక్తితో వీడియో కాల్‌ స్టార్ట్ చేయాలి. స్క్రీన్ కింద, స్క్రీన్ షేరింగ్ ఐకాన్‌పై క్లిక్ చేయాలి. ఈ ఐకాన్ ఫోన్‌ సింబల్‌, దానిలో కర్వ్‌డ్ షేప్ యారోతో కనిపిస్తుంది. ఐకాన్‌పై క్లిక్ చేశాక పాప్-అప్ మెసేజ్ అనిపిస్తుంది స్క్రీన్‌పై ఉన్న మొత్తం సమాచారానికి వాట్సప్ యాక్సెస్ అవుతుందని ఆ మెసేజ్ అలర్ట్ చేస్తుంది.

దానిని చదివాక స్టార్ట్ నౌ పై క్లిక్ చేస్తే స్క్రీన్ అవతలి వ్యక్తితో షేర్ అవుతుంది. ఆ సమయంలో ఎప్పటిలాగే యాప్స్‌, పిక్స్ ఇంకా ఏదైనా ఓపెన్ చేయవచ్చు. ఫోన్ స్క్రీన్‌పై కనిపిస్తున్నవన్నీ కూడా అవతలి వ్యక్తికి చూపించవచ్చు. ఇక ల్యాండ్‌స్కేప్ మోడ్‌ ఫీచర్ విషయానికి వస్తే.. స్క్రీన్ షేర్ స్టార్ట్ అయిన తర్వాత అవతలి వ్యక్తికి ఒక కొత్త యాప్ ఎలా వాడాలో లైవ్ స్క్రీన్ ద్వారా చూపించవచ్చు. ఇంకా ఇతర పనులు కూడా చేసుకోవచ్చు. ల్యాండ్‌స్కేప్ మోడ్‌లో వీడియో కాల్ చేసేందుకు స్క్రీన్ రొటేట్ చేస్తే సరిపోతుంది. లేదంటే మాన్యువల్‌గా అయినా వీడియో ఐకాన్‌పై క్లిక్ చేసి ల్యాండ్‌స్కేప్ వ్యూకు మార్చుకోవచ్చు.