WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు మరో గుడ్ న్యూస్.. వాట్సాప్ లోకి మరో సరికొత్త ఫీచర్?

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా నిత్యం లక్షలాది మంది

  • Written By:
  • Publish Date - January 17, 2023 / 07:00 AM IST

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా నిత్యం లక్షలాది మంది వినియోగదారులు వాట్సాప్ ను వినియోగిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటికే ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకోవాల్సిన వాట్సాప్ సంస్థ ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే వినియోగదారుల కోసం మరొక ఫీచర్ ని కూడా అందుబాటులోకి తీసుకురాబోతోంది వాట్సాప్ సంస్థ. త్వరలోనే బ్లాక్‌ ఫీచర్‌ షార్ట్‌ కట్‌ను అందించే ప్రయత్నాల్లో ఉంది. ప్రస్తుతం బీటా యూజర్లకు ఈ ఆప్షన్‌ అందుబాటులో ఉంది. వాట్సాప్‌లో తెలియని, నచ్చని వ్యక్తుల నుంచి వచ్చే అభ్యంతరకరమైన మెసేజ్‌లను చూడకుండా నంబర్‌లను బ్లాక్‌ చేస్తుంటారు.

కాంటాక్ట్‌ లిస్ట్‌లో లేని వ్యక్తుల నుంచి మెసేజ్‌లు వస్తే చాట్‌ పేజీ కింది భాగంలోనే బ్లాక్‌/రిపోర్ట్‌ అని ఆప్షన్లు కనిపిస్తాయి. ఒకవేళ కాంటాక్ట్‌ లిస్ట్‌లో ఉన్న వ్యక్తులనే బ్లాక్‌ చేయాలంటే చాట్‌ విండోలో ఆ వ్య క్తి చాట్‌ పేజీ ఓపెన్‌ చేయాలి. తర్వాత కుడివైపు పైభాగంలో ఉన్న మూడు చుక్క లపై క్లిక్ చేసి మెనూ ఓపెన్‌ అవుతుంది. అక్కడ మోర్‌పై క్లిక్ చేస్తే బ్లాక్‌ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేస్తే ఆ నంబర్‌ నుంచి ఇక ఎలాంటి మెసేజ్‌లు, కాల్స్‌ రావు. ఇకపోతే ఈ కొత్త ఫీచర్ ఎలా పనిచేస్తుంది అన్న విషయానికి వస్తే.. వాట్సాప్‌ కొత్తగా తీసుకొస్తున్న ఫీచర్‌తో మరింత సులువుగా చాట్‌ పేజీ ఓపెన్‌ చేయకుండా అవతలి వారిని బ్లాక్ చేయవచ్చు.

చాట్‌ విండోలో ఆ వ్యక్తి కాంటాక్ట్‌పై లాంగ్‌ప్రెస్‌ చేస్తే సెలెక్ట్‌ అయినట్లు చూపిస్తుంది. అనంతరం కుడివైపు పైభాగంలో ఉన్న మూడు చుక్క లపై క్లిక్ చేస్తే ఆప్షన్స్‌ మెనూ ఓపెన్‌ అవుతుంది.అందులో బ్లాక్‌ ఆప్షన్‌ సెలెక్ట్‌ చేస్తే యూజర్‌ బ్లాక్‌ లిస్ట్‌లోకి యాడ్‌ అవుతాడు. ఆ నంబర్‌ నుంచి ఎలాంటి మెసేజ్‌లు, కాల్స్ రావు. అయితే ప్రస్తుతం సింగిల్‌ యూజర్‌ను బ్లాక్ చేసేలా ఈ ఫీచర్‌ను టెస్ట్‌ చేస్తున్నారు. భవిష్యత్తులో ఒకేసారి ఒకరి కంటే ఎక్కువ మంది యూజర్లను బ్లాక్‌ చేసే విధంగా ఈ ఫీచర్‌ను డెవలప్‌ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
బంగారం