whatsapp new features : వాట్సప్ లో మరో 2 అట్రాక్టివ్ ఫీచర్స్

ఫేస్ బుక్ కొనుగోలు చేసినప్పటి నుంచి వాట్సప్ లో వినియోగదారుల కోసం కొత్త కొత్త ఫీచర్లు (whatsapp new features) వస్తున్నాయి. ఈక్రమంలోనే మనందరికీ ఎంతో ఉపయోగపడే మరో కొత్త ఫీచర్ (whatsapp new features)ను టెస్ట్ చేస్తోంది.

  • Written By:
  • Publish Date - May 8, 2023 / 08:51 AM IST

ఫేస్ బుక్ కొనుగోలు చేసినప్పటి నుంచి వాట్సప్ లో వినియోగదారుల కోసం కొత్త కొత్త ఫీచర్లు (whatsapp new features) వస్తున్నాయి. ఈక్రమంలోనే మనందరికీ ఎంతో ఉపయోగపడే మరో కొత్త ఫీచర్ (whatsapp new features)ను టెస్ట్ చేస్తోంది. దాని పేరే .. “సైలెన్స్ అన్‌నోన్ కాలర్స్” ఫీచర్. ఇందుకోసం మీరు సింపుల్ గా సెట్టింగ్స్ లోని ప్రైవసీ సెక్షన్ లోకి వెళ్లగానే “సైలెన్స్ అన్‌నోన్ కాలర్స్” ఫీచర్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేశాక .. మీరు అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చిన కాల్స్ ను వారి నంబర్ ను సెలెక్ట్ చేసి సైలెన్స్ (మ్యూట్) చేయొచ్చు. అయితే వాట్సాప్‌లోని ‘కాల్స్’ ట్యాబ్‌లో రికార్డ్ లాగ్ మాత్రం కనిపిస్తూనే ఉంటుంది. ఇంకా ఈ ఫీచర్ రిలీజ్ కాలేదు. దీన్ని ప్రయోగాత్మకంగా తొలుత ఆండ్రాయిడ్‌లోని వాట్సాప్ బీటా వెర్షన్ ‘2.23.10.7’లో అందుబాటులోకి తెచ్చారని WABetaInfo ఒక న్యూస్ రిపోర్ట్ ను పబ్లిష్ చేసింది. రాబోయే రోజుల్లో ఈ ఫీచర్ ను మరింత మంది వినియోగదారులకు అందుబాటులోకి తెస్తారని వెల్లడించింది. ఈ ఫీచర్‌తో ప్రజలు తాము స్వీకరించే వాట్సాప్ కాల్‌లపై మరింత నియంత్రణ సాధిస్తారు. స్కామర్‌ల బారిన పడే ముప్పు కూడా తగ్గుతుంది. వినియోగదారులు తమ ఖాతాల ప్రైవసీకి ఉపయోగించే అదనపు లేయర్ గా ఇది ఉపయోగపడుతుంది.

ALSO READ : Whatsapp Loan: వాట్సప్ ద్వారా లోన్ పొందవచ్చు.. జస్ట్ హాయ్ అని మెసేజ్ పెడితే చాలు..

వాట్సాప్ గ్రూప్స్ లో “అడ్మిన్ రివ్యూ” ఫీచర్

ఫేస్ బుక్ లోని గ్రూప్స్ లో అడ్మిన్ రివ్యూ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ గ్రూప్ లోని సభ్యులు ఎవరైనా పోస్ట్ పెడితే తొలుత గ్రూప్స్ అడ్మిన్ దగ్గరికి వెళ్తుంది. అడ్మిన్ అప్రూవ్ చేసిన తర్వాతే ఆ పోస్ట్ పబ్లిష్ అవుతుంది. ఒకవేళ అడ్మిన్ అప్రూవల్ ఇవ్వకుంటే పోస్ట్ పబ్లిష్ కాదు. అచ్చం ఇలాంటి ఫీచరే వాట్సాప్ లోనూ తీసుకొచ్చేటందుకు కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే Androidలోని వాట్సాప్ బీటా వెర్షన్ ‘2.23.10.8’లో అడ్మిన్ రివ్యూ ఫీచర్ ను టెస్ట్ చేస్తున్నారు. ఇది ఇంకా డెవలప్మెంట్ మోడ్ లోనే ఉంది. ప్రస్తుతం బీటా టెస్టర్ల కోసం అందుబాటులో లేదు. వాట్సప్ గ్రూపులపై అడ్మిన్ లకు మరింత నియంత్రణ ఇవ్వడానికి ఈ ఫీచర్ హెల్ప్ చేస్తుంది.