Site icon HashtagU Telugu

Whatsapp: వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త.. త్వరలో చాట్ ఫిల్టర్ ఆప్షన్?

Whatsapp

Whatsapp

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిత్యం లక్షలాది మంది వినియోగదారులు చాటింగ్ కోసం, వీడియో కాల్స్ ఇతర అవసరాల కోసం వాట్సాప్ ని ఉపయోగిస్తూనే ఉంటారు. అంతేకాకుండా రోజురోజుకీ స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్యతో పాటు వాట్సాప్ వినియోగదారుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. దీంతో వాట్సాప్ సంస్థ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా వాట్సాప్ సంస్థ మరో రెండు సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాబోతోంది.

వాట్సాప్‌లో త్వరలో ఫిల్టర్ ఆప్షన్ రానుంది. ఇది చాట్ లిస్ట్‌లో గణనీయమైన మార్పును తీసుకురానుంది. Meta యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వినియోగదారులకు చాట్ లిస్ట్ ఫిల్టర్ అనే కొత్త ఫీచర్‌ను విడుదల చేస్తోంది. ఈ ఫీచర్ ప్రస్తుతం అభివృద్ధిలో ఉంది. ఇది వాట్సాప్ బీటా 2.23.14.17 అప్‌డేట్‌లో ఉంది. ఈ కొత్త టూల్‌కి సంబంధించిన స్క్రీన్‌షాట్ కూడా హల్‌చల్ చేస్తోంది. ఈ ఎంపిక ద్వారా చాట్ జాబితాను సులభంగా నిర్వహించవచ్చు.

అలాగే ఫిల్టర్‌లో మూడు ఎంపికలు ఉంటాయి. చదవని సందేశాలు, వ్యక్తిగత సంభాషణలు, వ్యాపార సంభాషణలు అనే మూడు ఎంపికలు ఉంటాయి. వాట్సాప్‌లో కుడి ఎగువ మూలలో ఈ ఫిల్టర్ బటన్ ఉంటుందని చెప్పారు. ఈ ఫీచర్‌తో వినియోగదారులు ముఖ్యమైన చాట్‌లను సెకన్లలో యాక్సెస్ చేయవచ్చు.