Site icon HashtagU Telugu

WhatsApp: వాట్సాప్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇకపై ఛానల్స్‌లో కూడా పోల్స్‌?

Mixcollage 15 Jan 2024 04 23 Pm 9901

Mixcollage 15 Jan 2024 04 23 Pm 9901

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిత్యం కోట్లాదిమంది ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్స్ లో వాట్సాప్ ముందు వరుసలో ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక వాట్సాప్ వినియోగదారుల సంఖ్య రోజుకి పెరుగుతూనే ఉండడంతో వినియోగదారులను మరింత ఆకర్షించడం కోసం వాట్సాప్ సంస్థ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తూనే ఉంది. కాగా ఇప్పటికే పదుల సంఖ్యలో కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేసిన వాట్సాప్ సంస్థ ఇప్పుడు వినియోగదారుల కోసం మరో సరికొత్త ఫీచర్ ని తీసుకొచ్చింది.

ఛానెల్స్‌లో పోల్స్‌ క్రియేట్‌ చేసే కొత్త ఫీచర్‌ తీసుకొస్తోంది. ఇప్పటివరకు గ్రూప్స్‌, చాట్స్‌కు మాత్రమే పరిమితమైన వాట్సప్‌ పోల్స్‌ ఇకపై ఛానెల్స్‌లోనూ దర్శనమివ్వనున్నాయి. వాట్సాప్ కి సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ అందించే వాబీటా ఇన్ఫో తన బ్లాగ్‌లో ఈ విషయాన్ని పంచుకుంది. సాధారణంగా వాట్సప్‌లో పోల్స్‌ నిర్వహించే విధంగానే ఛానెల్స్‌లోనూ పోల్స్‌ క్రియేట్‌ చేయొచ్చు. టెక్ట్స్‌ బాక్స్‌ లో కనిపించే అటాచ్‌మెంట్‌ సింబల్‌పై క్లిక్‌ చేయగానే పోల్స్ ఆప్షన్‌ కనిపిస్తుంది. దాన్ని ఎంచుకొని క్రియేట్‌ చేయొచ్చు. ఛానెల్‌ నిర్వహిస్తున్న వ్యక్తికి మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది.

పోల్స్‌ క్రియేట్‌ చేసే సమయంలో అలో సింగిల్ పోల్ ఆప్షన్‌ ను ఎంపిక చేసుకోవచ్చు. దీంతో ఫాలోవర్లకు కేవలం ఒక ఆప్షన్‌ మాత్రమే ఎంచుకొనే వెసులుబాటు ఉంటుంది. వాట్సప్‌ ఛానెల్స్‌ను అనుసరించే వారి వివరాలు గోప్యంగా ఉంటాయి. పోల్స్‌లో ఎవరు పాల్గొంటున్నారనే విషయం ఛానెల్‌ క్రియేట్‌ చేసిన వ్యక్తులు కూడా తెలుసుకోలేరు. ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ బీటా యూజర్లకు ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది, త్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది. నచ్చిన ఫొటోలు ఎంచుకొని వాటికి టెక్ట్స్‌ యాడ్‌ చేసి స్టిక్కర్లు క్రియేట్‌ చేసే సదుపాయాన్ని వాట్సప్‌ ఐఫోన్‌ యూజర్ల కోసం తీసుకొచ్చింది. ఐఫోన్‌లో వాట్సప్‌ ఓపెన్‌ చేసి టెక్ట్స్‌ బాక్స్‌ పక్కన ఉండే స్టిక్కర్‌ ట్రేపై క్లిక్‌ చేసి అందులో కనిపించే క్రియేట్ స్టికర్ ఆప్షన్‌పై క్లిక్‌ చేసి నచ్చిన ఫొటో ఎంపిక చేసుకోవచ్చు. ఆపై మీకు నచ్చిన టెక్ట్స్‌, డ్రాయింగ్‌ వంటివి జోడిస్తే మీ స్టిక్కర్‌ రెడీ. ఇలా క్రియేట్‌ చేసిన స్టిక్కర్‌ ఇతరులకు షేర్‌ చేయగానే ఆటోమేటిక్‌గా సేవ్‌ అవుతుంది.