WhatsApp: వాట్సాప్ లో మరో సరికొత్త ఫీచర్.. ఫోటోని స్టిక్కర్ గా మార్చేయవచ్చట?

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మన అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా

  • Written By:
  • Publish Date - March 1, 2023 / 07:30 AM IST

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మన అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ వినియోగదారుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా ఈ వాట్సాప్ తోనే కాలక్షేపం చేస్తూ ఉంటారు. వాట్సాప్ వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండడంతో వాట్సాప్ సంస్థ వారు కూడా ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వాట్సాప్ సంస్థ మరో కొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. వాట్సాప్ సంస్థ 2018 లో స్టిక్కర్ సపోర్ట్ పరిచయం చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వాట్సాప్‌ యూజర్ల కోసం రెండు ఫస్ట్ పార్టీ స్టిక్కర్స్‌ ప్యాక్‌లను తీసుకొచ్చింది.

వాట్సాప్‌లోని మార్పులను ట్రాక్ చేసే వెబ్‌సైట్ WABetaInfo వివరాల మేరకు.. వాట్సాప్‌ నిశ్శబ్దంగా iOS వెర్షన్ యాప్‌కి కొత్త ఫీచర్‌ను జోడించనున్నట్లు తెలిపింది. వినియోగదారులు తమ గ్యాలరీ ఫోటోలను ఎటువంటి థర్డ్‌ పార్టీ యాప్ అవసరం లేకుండా త్వరగా వాట్సాప్‌ స్టిక్కర్‌లుగా మార్చడానికి ఉపయోగపడుతుందని తెలిపింది. ఈ ఫీచర్ వాట్సాప్‌ ఐఫోన్‌ వెర్షన్ 23.3.77తో అందుబాటులో ఉంది. ఇప్పుడు వినియోగదారులు యాపిల్‌ యాప్‌ స్టోర్‌ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఐఫోన్‌లో నేటివ్‌ కస్టమ్ స్టిక్కర్ మేకర్‌ ఎలా పనిచేస్తుంది? ఈ కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ ఐఫోన్ ఆల్బమ్ నుంచి ఫోటోను సెలక్ట్‌ చేసుకుని, వాట్సాప్ స్టిక్కర్‌గా మార్చుకోవచ్చు. కానీ ఈ ప్రాసెస్‌ అంత సులువు కాదు. కస్టమ్ స్టిక్కర్‌ల కోసం వాట్సాప్ కచ్చితంగా నిర్దిష్ట ఆప్షన్‌ను యాడ్‌ చేయలేదు.

అయితే ఇది ప్రాథమికంగా iOS 16 APIపై ఆధారపడి ఉంటుంది. ఇది లాంగ్‌ ప్రెస్సింగ్‌, డ్రాగ్‌ అండ్‌ డ్రాప్‌ వంటి వాటి ద్వారా ఇమేజ్‌ నుంచి సబ్జెక్ట్‌ను సెపరేట్‌ చేస్తుంది. సబ్జెక్ట్‌ వేరు అయిన తర్వాత వినియోగదారులు దానిని స్టిక్కర్‌గా మార్చడానికి వాట్సాప్ కన్వర్జేషన్‌లో డ్రాగ్ చేసి డ్రాప్ చేయవచ్చు. ఐఓఎస్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఐఫోన్‌లతో మాత్రమే ఈ ఫీచర్ పనిచేస్తుంది. పాత iOS వెర్షన్‌లు ఈ ఫీచర్‌ని సపోర్ట్‌ చేయవు. ఇందుకోసం ముందుగా ఐఫోన్‌లో ఫోటోస్‌ యాప్‌ని ఓపెన్‌ చేయాలి. ఇమేజ్‌ను సెలక్ట్‌ చేసుకుని ఇమేజ్‌ నుంచి సబ్జెక్ట్‌ను వేరు చేయడానికి ఫోటోపై ట్యాప్‌ చేసి హోల్డ్‌ చేసి ఉంచండి. ఇప్పుడు ఏదైనా వాట్సాప్‌ కన్వర్జేషన్‌లోకి సబ్జెక్ట్‌ని డ్రాగ్‌ చేసి డ్రాప్‌ చేయండి. ఈ ప్రాసెస్‌ అయిన తర్వాత.. ఈ ఇమేజ్‌ను స్టిక్కర్‌గా మార్చాలనుకుంటున్నారా? అని వాట్సాప్ అడుగుతుంది. స్టిక్కర్‌ని క్రియేట్‌ చేసిన తర్వాత, అది వాట్సాప్‌ స్టిక్కర్‌ కలెక్షన్‌లో ఉంటుంది. ఇతర వాట్సాప్‌ కన్వర్జేషన్‌లకు మళ్లీ ఉపయోగించుకోవచ్చు.