Whatsapp: వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్.. ఇకపై ఏం మాట్లాడినా కూడా నో ప్రాబ్లం?

ప్రముఖ మెసెజింగ్ యాప్ వాట్సాప్ సంస్థ ఇప్పటికే వినియోగదారుల కోసం ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. వినియోగదారులను ఆకర్షించడం కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తూనే ఉంది. అలాగే వాట్సాప్ వినియో

  • Written By:
  • Publish Date - July 11, 2024 / 10:14 AM IST

ప్రముఖ మెసెజింగ్ యాప్ వాట్సాప్ సంస్థ ఇప్పటికే వినియోగదారుల కోసం ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. వినియోగదారులను ఆకర్షించడం కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తూనే ఉంది. అలాగే వాట్సాప్ వినియోగదారుల భద్రత కోసం ఇప్పటికే పలు రకాల ఫీచర్లను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే వాట్సాప్ సంస్థ తాజాగా వినియోగదారులకు మన శుభవార్తను తెలిపింది. తాజాగా వాట్సాప్ కొత్త ఫీచర్ పేరు వాయిస్ మెసేజ్ ట్రాన్స్‌స్క్రిప్ట్‌. ఈ కొత్త ఫీచర్ వాట్సాప్ ట్రాన్స్‌స్క్రిప్షన్ ఫీచర్ ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ వాయిస్ మెసేజెస్ కోసం ఉపయోగపడుతుంది.

దీని సహాయంతో యూజర్లు అందుకున్న వాయిస్ మెసేజ్ ను టెక్ట్స్ గా మార్చుకోవచ్చు. వాట్సాప్‌ లో చాటింగ్‌ తో పాటుగా ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తుంటారు. ఇది కాకుండా వాట్సాప్ తన వినియోగదారులకు వాయిస్ నోట్ అంటే వాయిస్ మెసేజ్ ఫీచర్‌ ను కూడా అందిస్తోంది. ఒకవేళ మీకు సందేశాన్ని టైప్ చేయడం సాధ్యం కాకపోతే, యూజర్ మాట్లాడటం ద్వారా సందేశాన్ని రికార్డ్ చేసి పంపవచ్చు. వాయిస్ అనేది మెసేజ్ టైప్ చేయడం కంటే సులభం అలాగే ఇది తక్కువ సమయం పడుతుంది. అయితే వాయిస్ మెసేజ్ లో ప్రైవేట్ సంభాషణ ఉంటే దాన్ని పక్కన ఉన్నవారి మధ్య ప్లే చేయడం కష్టం. ఇయర్ బడ్స్ కలిగి ఉండాలి. అప్పుడే ఎవరికీ వినిపించకుండా మీరు మాత్రమే వినవచ్చు.

కానీ చాలా మంది వినియోగదారులు ఎల్లప్పుడూ ఇయర్స్ బడ్స్ అందుబాటులో పెట్టుకోరు. ఈ సమస్యను అధిగమించేందుకు వాట్సాప్ లో కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఫీచర్ వాయిస్ మెసేజ్ ట్రాన్స్‌స్క్రిప్ట్‌. వాట్సాప్ ట్రాన్స్‌స్క్రిప్షన్ ఫీచర్ ఇన్‌కమింగ్, అవుట్‌గోయింగ్ వాయిస్ సందేశాల కోసం ఉపయోగించుకోవచ్చు. ఇది వాయిస్ మెసేజ్ లను టెక్ట్స్ గా మారుస్తుంది. ఈ ఫీచర్‌ను సెటప్ చేసుకోవాలంటే 136 ఎంబీ డేటాను వెచ్చించాల్సి ఉంటుంది. వాయిస్ ట్రాన్స్‌స్క్రిప్ట్‌ పరికరంలోనే జనరేట్ అవుతాయి. తద్వారా మీరు తప్ప మరెవరూ వాటిని వినలేరు లేదా చదవలేరు. వాయిస్ ట్రాన్స్‌స్క్రిప్షన్ కోసం హిందీతో సహా ఐదు భాషలను కంపెనీ సపోర్ట్ చేస్తోంది. వాట్సాప్ లోని ఈ ఫీచర్ యూజర్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది. వినికిడి సమస్య ఉన్న యూజర్లకు ఈ ఫీచర్ ఎంతగానో అవసరం. గూగుల్ ప్లే స్టోర్లో ఆండ్రాయిడ్ 2.24.15.5 కోసం వాట్సాప్ బీటాలో ఈ కొత్త ఫీచర్‌ను డబ్ల్యూఏబీటాఇన్ఫో చూసింది. బీటా టెస్టింగ్ తరువాత కంపెనీ ఈ ఫీచర్‌ను యూజర్లకు విడుదల చేస్తుంది.

Follow us