Site icon HashtagU Telugu

WhatsApp Feature : వాట్సాప్ లో ‘కోడ్ బ్లాక్’, ‘కోట్ బ్లాక్’ టూల్స్.. ఏమిటివి ?

Whatsapp Feature

Whatsapp Feature

WhatsApp Feature : వాట్సాప్ లో మనం పంపే మెసేజ్ లలో కొత్తకొత్త ఫార్మాట్లను అందుబాటులోకి తేవడంపై వాట్సాప్ కంపెనీ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే దీనికి సంబంధించిన కొత్త టూల్స్ ను డెవలప్ చేసి బీటా వర్షన్ లో విడుదల చేసింది. అయితే అతి కొద్దిమందికే టెస్టింగ్ కోసం వీటిని రిలీజ్ చేసింది. కొంతమందికి  ఐవోఎస్ 23.21.1.75 వాట్సాప్ బీటా వర్షన్ లో ఈ కొత్త టూల్స్ ను విడుదల చేశారు. అయితే ఐవోఎస్  23.21.1.72, ఐవోఎస్  23.21.1.73 వర్షన్లలోనూ ఏదో ఒక దాన్ని ఇన్ స్టాల్ చేసుకొని ఈ టూల్స్ ను టెస్ట్ చేయొచ్చని వాట్సాప్ వెల్లడించింది. ఈ టెస్టింగ్ లో మంచి ఫలితాలు వస్తే క్రమంగా వాట్సాప్ వినియోగదారులు అందరికీ సరికొత్త టెక్ట్స్ ఫార్మాటింగ్ టూల్స్ (WhatsApp Feature)  అందుబాటులోకి వస్తాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఏమిటీ టూల్స్ ? 

  • కోడ్ బ్లాక్ : వాట్సాప్‌లో కోడ్‌లను షేర్ చేసేందుకు, చదివేందుకు అనుకూలంగా ఉండేలా ‘కోడ్ బ్లాక్’ పేరుతో ఒక టూల్ ను రెడీ చేశారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు,  ప్రోగ్రామర్ల కోసం దీన్ని తయారు చేశారు. అయితే సాధారణ వాట్సాప్ యూజర్స్ దీన్ని వాడుకొని.. మెసేజ్ లోని ఏదైనా ఒక ప్రత్యేక భాగాన్ని హైలైట్ చేయొచ్చు. అయితే ఈ టూల్ ను వాడేందుకు ‘బ్యాక్‌టిక్ క్యారెక్టర్’ అవసరం.
  • కోట్ బ్లాక్:  ఏదైనా మెసేజ్ మనకు వచ్చినప్పుడు, అందులోని నిర్దిష్ట భాగానికి.. స్పెషల్ గా ఆన్సర్ ఇవ్వడానికి కోట్ బ్లాక్ టూల్ ఉపయోగపడుతుంది. మీరు “>” అక్షరాన్ని ఉపయోగించడం ద్వారా ఈ ఫార్మాటింగ్ టూల్ ను అప్లై చేయగలుగుతారు.
  • లిస్ట్స్ : మనకు వాట్సాప్ లో వచ్చే మెసేజ్ లను క్రమపద్ధతిలో నిర్వహించడానికి ‘లిస్ట్స్’ టూల్ ఉపయోగపడుతుంది. ఈ ఫార్మాట్ లోకి మార్చే మెసేజ్ లకు ముందు ‘నక్షత్రం గుర్తు’ లేదా ‘హైఫన్‌’ ఉండేలా మనం సెట్టింగ్స్ చేయొచ్చు. నంబరింగ్ క్రమంలో మెసేజ్ లు లిస్ట్ అయ్యేలా కూడా చేయొచ్చు.

Also Read: Whats Today : బీఆర్ఎస్ లోకి రావుల, జిట్టా.. చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంలో విచారణ