WhatsApp: మరో అదిరిపోయే అప్డేట్ ని విడుదల చేసిన వాట్సాప్.. ఇకపై కాల్స్ కూడా షెడ్యూల్ చేయవచ్చట?

టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో స్మార్ట్ ఫోన్ ల వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. దాంతో చిన్న పెద్ద అని తేడా

  • Written By:
  • Publish Date - February 28, 2023 / 07:30 AM IST

టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో స్మార్ట్ ఫోన్ ల వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. దాంతో చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారు. అయితే స్మార్ట్ ఫోన్ ఉంది అంటే కచ్చితంగా అందులో వాట్సాప్ కచ్చితంగా ఉండే ఉంటుంది. దాదాపుగా ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్ లోనూ ఈ వాట్సాప్ కచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు. వాట్సాప్ వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుండడంతో వాట్సాప్ సంస్థ నిత్యం ఎన్నో రకాల ఫీచర్లను వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ నేపథ్యంలోనే వాట్సాప్ సంస్థ వినియోగదారుల కోసం మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది.

అదే గ్రూప్‌ కాల్‌ షెడ్యూల్‌. వాట్సాప్‌ అప్లికేషన్‌లో గ్రూప్‌ కాల్‌ షెడ్యూల్‌ ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు వాట్సాప్ సంస్థ అనే ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఇది టెస్టింగ్‌ దశలో ఉంది. ముందుగా టెస్ట్‌ ఫ్లై ప్రొగ్రాంలో నమోదు చేసుకున్నవారికి, లేటెస్ట్‌ అప్‌డేట్‌ వెర్షన్‌ iOS 23.4.0 వాట్సాప్‌ బీటా వినియోగిస్తున్న వారికి ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. సాధారణంగా కుటుంబ సభ్యులు, స్నేహితులతో ముఖ్యమైన అంశాలు మాట్లాడాల్సి వచ్చిన ఆఫీసులోని వాళ్లతో ముఖ్యమైన మీటింగ్‌లు నిర్వహించాల్సి వచ్చినా గతంలో రిమైండర్లు పెట్టుకోవాల్సి వచ్చేది. కానీ ఇక పై ఆ ఇబ్బంది ఉండదు. తాజాగా వాట్సాప్ సంస్థ పరిచయం చేసిన కాల్‌ షెడ్యూల్‌ ఫీచర్‌తో ఆ ఇబ్బంది తప్పుతుంది. ఇందుకోసం ముందుగానే తేదీ, సమయం ఫిక్స్‌ చేసుకుంటే సరిపోతుంది. ముఖ్యమైన పనుల్లో బిజీగా ఉండేవారికి ఈ ఫీచర్‌ చాలా ఉపయోగపడుతుందని WABetainfo తన నివేదికలో వెల్లడించింది.

ఎవరితో ఎప్పుడు మాట్లాడాలో ముందే షెడ్యూల్‌ చేసుకుంటారు. కాబట్టి ఎటువంటి గందరగోళం ఉండదు. మరి ఈ సరికొత్త ఫ్యూచర్ ని ఎలా వినియోగించుకోవాలి అన్న విషయాన్ని వస్తే.. వాట్సాప్ లో కాల్‌ బటన్‌ నొక్కినప్పుడు కంటెస్ట్ మెను(context Memu)లో నుంచి షెడ్యూల్‌ కాల్‌ ఆప్షన్‌ను వినియోగించవచ్చు. అందులో ఎప్పుడు కాల్‌ చేయాలి, ఎవరెవరికి చేయాలని అనుకుంటున్నామో వారి పేర్లు సెలక్ట్‌ చేయొచ్చు. ఆ టైంకి మీరు సెలక్ట్‌ చేసిన పేర్లకు అలర్ట్‌ వెళ్తుంది. ఆ టైంకి షెడ్యూల్‌ కాల్‌లో అందరూ జాయిన్‌ అవుతారు. గ్రూప్‌ కాల్‌ షెడ్యూల్‌ను ఆడియో లేదా వీడియో కాల్స్‌ రూపంలో ఎలాగైనా చేసుకునే అవకాశం ఉంది. వాట్పాస్‌ నుంచి ఆన్‌లైన్‌ మీటింగ్స్‌ నిర్వహించేవారికి ఈ ఫీచర్‌తో ఎంతో ప్రయోజనం.