WhatsApp: వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. 2జీబీ డాకుమెంట్స్ కూడా షేర్ చేసేలా?

దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. రోజురోజుకీ

  • Written By:
  • Publish Date - February 17, 2023 / 07:00 AM IST

దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. రోజురోజుకీ వాట్సాప్ వినియోగదారుల సంఖ్య పెరిగిపోతుండడంతో వాట్సాప్ సంస్థ కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే వాట్సాప్ సంస్థ వినియోగదారుల కోసం మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. కాగా చాలా మంది వాట్సాప్‌ వినియోగదారుల్లో ఉన్న అసంతృప్తి ఏంటంటే? పెద్ద సైజ్‌లో ఉన్న డాక్యుమెంట్‌లను షేర్‌ చేయలేకపోవడం. కానీ వాట్సాప్ సంస్థ ఈ అసంతృప్తిని దూరం చేసే ప్రయత్నాలను వాట్సాప్‌ కంపెనీ ప్రారంభించింది.

ఇప్పుడు వాట్సాప్ ద్వారా 2జీబీ పరిమాణంలో ఉన్న డాక్యుమెంట్‌లను షేర్ చేసే సదుపాయాన్ని వినియోగదారులు అందించేందుకు కృషి చేస్తోంది. ఈ ఫీచర్‌ను భవిష్యత్తులో రానున్న iOS యాప్ అప్‌డేట్‌లో అందించాలనే ఆలోచనలో ఉంది. ఇక ఈ ఫీచర్ విషయానికి వస్తే.. 2జీబీ పరిమాణంలో ఉన్న డాక్యుమెంట్‌లను షేర్ చేసే సామర్థ్యం అందుబాటులో ఉంది. పెద్ద డాక్యుమెంట్‌లను షేర్ చేయడం సులభతరం చేస్తుంది. ఈ అప్‌డేట్‌ను త్వరలో ప్రకటించాలనే ఆలోచనలో వాట్సాప్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తరహా ఫీచర్ కొత్తది కాదు. ఎందుకంటే వాట్సాప్ ఇప్పటికే గత సంవత్సరం 512 మంది వ్యక్తులను గ్రూప్‌లో యాడ్‌ చేసే సదుపాయం కల్పించింది.

తాజా వాట్సాప్ బీటా, iOS 23.3.0.76 అప్‌డేట్‌ ద్వారా భవిష్యత్తులో iOS యాప్ అప్‌డేట్‌లో ఇలాంటి ఫీచర్‌ను విడుదల చేయడానికి వాట్సాప్‌ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసిందని WABetaInfo తెలిపింది. ఒకవేళ ఈ ఫీచర్ కనుక అందుబాటులోకి వస్తే ఎంతో మందికి ఊరట లభిస్తుందని చెప్పవచ్చు. అంతేకాకుండా పెద్ద సైజు డాక్యుమెంట్లను పంపవచ్చు. ఈ ఫీచర్ వినియోగదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పవచ్చు.