Site icon HashtagU Telugu

WhatsApp: వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. ఇకపై స్టేటస్ లను రిపోర్ట్ చేయవచ్చట?

Tulasi Tree

Tulasi Tree

టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో స్మార్ట్ ఫోన్ ల వినియోగం పెరిగిపోయింది. దీంతో చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ ఉంది అంటే కచ్చితంగా అందులో వాట్సాప్ కచ్చితంగా ఉండే ఉంటుంది. కాగా వాట్సాప్ వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుండడంతో వాట్సాప్ సంస్థ నిత్యం ఎన్నో రకాల ఫీచర్లను వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ నేపథ్యంలోనే వినియోగదారుల కోసం మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది వాట్సాప్ సంస్థ. తాజాగా మరో ఫీచర్ ని పరిచయం చేసింది వాట్సాప్ సంస్థ. అదే స్టేటస్ అప్‌డేట్స్‌ రిపోర్ట్‌ చేసే సదుపాయం.

స్టేటస్‌లలో పోస్ట్ చేసే కంటెంట్‌ నియమాలకు లోబడి ఉండేలా చర్యలు తీసుకుంది. ఈ లేటెస్ట్‌ ఫీచర్ ఎలా పని చేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా వాట్సాప్‌ సంస్థ కొత్తగా తీసుకొచ్చిన ఫీచర్ ఎక్స్‌పీరియన్స్‌ చేసే అవకాశం కొంత మంది బీటా టెస్టర్‌లకు మాత్రమే ఉంది. దశల వారీగా యూజర్లు అందరికీ అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం టెస్ట్ ఫ్లైట్ యాప్ నుంచి iOS 23.4.0.74 అప్‌డేట్ ఇన్‌స్టాల్‌ చేసిన వాట్సాప్‌ బీటా టెస్టర్‌లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. వాట్సాప్‌ అప్‌డేట్స్‌ ట్రాక్ చేసే వెబ్‌సైట్ WABetaInfo నివేదిక మేరకు..స్టేటస్‌ అప్‌డేట్‌లను రిపోర్ట్‌ చేసే సదుపాయం డెవలప్‌మెంట్‌లో ఉంది.

మోడరేటర్‌లు చాట్ బ్రాడ్‌కాస్టర్‌ నిర్ణయించిన నియమాలు, కంటెంట్ ప్రమాణాలకు అనుగుణంగా చాట్‌లు, పోస్ట్‌లు ఉండేలా పర్యవేక్షిస్తారు. అభ్యంతరకరమైన కంటెంట్‌ను తొలగిస్తారు. కాగా WABetaInfo షేర్‌ చేసిన స్క్రీన్‌షాట్ ప్రకారం ఏ వాట్సాప్‌ అకౌంట్‌కు లేటెస్ట్‌ అప్‌డేట్‌ లభిస్తుందో అందులో స్టేటస్‌ ఆప్షన్స్‌లో రిపోర్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. స్టేటస్ అప్‌డేట్‌ను రిపోర్ట్‌ చేసినప్పుడు, మోడరేషన్ కారణాల వల్ల అది వాట్సాప్‌కు ఫార్వార్డ్‌ అవుతుంది. వాట్సాప్‌ ఆ స్టేటస్‌ కంటెంట్‌ను పరిశీలిస్తుంది. నియమాలను ఉల్లంఘించినట్లు గుర్తిస్తే, సంబంధిత అకౌంట్‌ను తాత్కాలికంగా నిలిపివేసే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా ఈ ఫీచర్‌ ఎండ్‌ టూ ఎన్‌క్రిప్షన్‌ విషయంలో ఎలాంటి సమస్యలు తీసుకురాదు. మెసేజ్‌లు, కాల్‌లకు ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ ఉంటుంది. వాట్సాప్, మెటా, ప్రాక్సీ ప్రొవైడర్, ఇతరులు ఎవరూ వాట్సాప్‌ యూజర్‌ వ్యక్తిగత మెసేజ్‌లను చదవలేరు, ప్రైవేట్ కాల్‌లను వినలేరని WABetaInfo నివేదిక పేర్కొంది.