Site icon HashtagU Telugu

Whatsapp New Call : వాట్సాప్ కాల్ ఆప్షన్ లో కొత్త ఫీచర్.. ‘న్యూ కాల్’

Whatsapp New Call

Whatsapp New Call

Whatsapp New Call : వాట్సాప్ కు ఎంతగా జనంలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంటర్నెట్ వినియోగం పెరిగిన తర్వాత వాట్సాప్ కాల్స్ చేయడం కూడా బాగా పెరిగిపోయింది. ఈ తరుణంలో వాట్సాప్ కాల్స్ సెక్షన్ లో కొత్త ఫీచర్స్ ను యాడ్ చేయడంపై వాట్సాప్ యజమాని మార్క్ జుకర్ బర్గ్ ఫోకస్ పెట్టారు. వాట్సాప్ లో యూజర్ల కాలింగ్ ను ఇంకా బెటర్ చేసేందుకుగానూ కొన్ని మార్పులు జరగబోతున్నాయి. ‘కాల్స్’ ట్యాబ్‌లో ప్రస్తుతం మనకు పై భాగంలో ‘కాల్ లింక్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది.  అయితే త్వరలో ‘కాల్ లింక్’ ఆప్షన్ స్థానంలో ‘న్యూ కాల్’ అనే సరికొత్త ఆప్షన్‌ చేరబోతోంది.

Also read : Plane Crash : బ్రెజిల్ లో కూలిన టూరిస్టు విమానం.. 14 మంది మృతి

ఇదొక్కటే కాదండోయ్.. వాట్సాప్ కాల్ కు మరో 31 మందిని యాడ్ చేసే సౌకర్యం కూడా అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం వాట్సాప్ కాల్ కు 15 మందిని మాత్రమే యాడ్ చేసే ఫెసిలిటీ ఉంది. ఈమేరకు వివరాలతో Wabetainfo వెబ్ సైట్ ఒక రిపోర్టును పబ్లిష్ చేసింది. వాట్సాప్ కాల్ కు 31 మందిని యాడ్ చేసే అప్ డేట్ ప్రస్తుతం వాట్సాప్ బీటా 2.23.19.16 వర్షన్ లో టెస్టింగ్ దశలో ఉందని తెలిపింది. ఇక వీడియో కాలింగ్ అవతార్ ఫీచర్‌పై కూడా వాట్సాప్ ముమ్మర కసరత్తు చేస్తోంది. ఇది అందుబాటులోకి  వచ్చాక.. మనం ఎవరికైనా వీడియో కాల్ లను చేసినప్పుడు, మన ముఖానికి బదులుగా యూజర్ అవతార్‌ కనిపిస్తుంది. ఈ అవతార్‌లను మన ముఖ కవళికలు, సంజ్ఞలకు అనుగుణంగా తయారు చేసుకోవచ్చు. ఈ ఫీచర్ కూడా ఇప్పుడు బీటా టెస్టింగ్ స్టేజ్ లోనే (Whatsapp New Call) ఉంది.