Site icon HashtagU Telugu

Whats APP : వాట్సాప్ లో కొత్త ఫీచర్..Kept Messages !

Whatsapp Call

Whatsapp Call

ప్రముఖ మెసేజింగ్ ఫ్లాట్‌ఫామ్ వాట్సాప్ సరికొత్త ఫీచర్లను యూజర్లకు ఎల్లప్పుడూ పరిచయం చేస్తూనే ఉంది. అలానే అదిరిపోయే ఫీచర్లను డెవలప్, టెస్టింగ్ చేస్తోంది. ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్ల గురించి కొంతకాలంగా చర్చ జరుగుతుంది. వాట్సాప్‌ కొత్త ఫీచర్లు, అప్‌డేట్‌ల గురించి ప్రతిరోజూ వార్తలు వస్తున్నాయి. వాట్సాప్ కూడా ఈ ఫీచర్ల అభివృద్ధిపై నిరంతరం కృషి చేస్తోంది. ఇప్పుడు వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌తో ముందుకు వచ్చింది, ఏంటంటే యూజర్లు Disapp earing messages ఎప్పుడైనా చూడొచ్చు. ఇంతకు ముందు యూజర్ల  మెసేజెస్ డిసపియర్ కావడానికి 24 గంటలు, 7 రోజులు లేదా 90 రోజులు ఆప్షన్ ఉండేది. కానీ ఈ కొత్త ఫీచర్ వచ్చాక మెసేజ్ ఎప్పటికీ డిలెట్ కాదు.

డిలెట్ అయిన తర్వాత కూడా..

WABetaInfo నివేదిక ప్రకారం.. WhatsApp డిసపియర్ Kept Messages ఫీచర్‌పై పని చేస్తోంది. దీంతో మెసేజ్ డిసపియర్ అయిన తర్వాత కూడా కనిపిస్తుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ అండ్ వాట్సాప్ డెస్క్‌టాప్ కోసం వాట్సాప్ ఈ డిసపియర్ కెప్ట్ మెసేజెస్ ఫీచర్‌ను విడుదల చేస్తుంది. ఈ ఫీచర్ తర్వాత, వినియోగదారులు డిసపియర్ మోడ్‌లో చేసిన మెసేజెస్ డిలెట్ అయిన తర్వాత కూడా చూడగలరు.  ఈ కొత్త ఫీచర్‌కి Kept Messages అని పేరు పెట్టింది. వినియోగదారులందరూ  చాట్ లో Kept మెసేజెస్ ఉపయోగించవచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం డెవలప్‌మెంట్ మోడ్‌లో ఉన్నప్పటికీ, రానున్న రోజుల్లో మరిన్ని మార్పులను ఇందులో చూడవచ్చు. యూజర్ నోటిఫికేషన్ లేకుండా కూడా Kept Messagesతో WhatsApp కూడా సైలెంట్ లీవ్ గ్రూప్ ఆప్షన్‌పై పని చేస్తోంది. ఒక యూజర్ గ్రూప్ నుంచి డిలేట్ అయిన తర్వాత ఎటువంటి నోటిఫికేషన్ పంపదు. గ్రూప్ అడ్మిన్ మాత్రమే గ్రూప్ నుంచి వెళ్ళిపోయిన వారి సమాచారాన్ని పొందొచ్చు.