WhatsApp: తీసేసిన ఫీచర్ ను తిరిగి తీసుకొస్తున్న వాట్సప్.. అదేంటంటే?

ఈ మధ్యకాలంలో స్మార్ట్ఫోన్ వాడుతున్న వారికి వాట్సాప్ అనే చాటింగ్ ఆప్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. స్మార్ట్ఫోన్లు ఉన్న ప్రతి ఒక్కరు వాట్సాప్ తో బాగా కాలక్షేపం చేస్తున్నారు.

  • Written By:
  • Publish Date - January 1, 2023 / 10:46 PM IST

WhatsApp: ఈ మధ్యకాలంలో స్మార్ట్ఫోన్ వాడుతున్న వారికి వాట్సాప్ అనే చాటింగ్ ఆప్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. స్మార్ట్ఫోన్లు ఉన్న ప్రతి ఒక్కరు వాట్సాప్ తో బాగా కాలక్షేపం చేస్తున్నారు. ఇప్పటివరకు వాట్సాప్ ఎన్నో ఫీచర్లతో ముందుకు వచ్చింది. వాట్సాప్ నిర్వహకులు కొత్త ఫీచర్లు అందించినప్పుడల్లా యూజర్స్ వాట్సాప్ అప్డేట్ చేసుకొని కొత్త ఫీచర్లను బాగా వాడుకుంటున్నారు. ఇప్పటికే డెస్క్‌టాప్ యూజర్ల కోసం వాట్సాప్‌ కొత్తకొత్త ఫీచర్‌ లను తీసుకొచ్చింది.

అయితే గత ఏడాది వాట్సప్ ఒక ఫీచర్ ని తొలగించింది. అదేంటంటే ఒకటి కంటే ఎక్కువ మెసేజ్ లను ఇతరులకు పంపెందుకు లేదా డిలీట్ చేసేందుకు మల్టిపుల్ చాట్ సెలక్షన్ ఫీచర్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే ఈ ఫీచర్ ను గత ఏడాది వాట్సాప్ డెస్క్ టాప్ నుంచి డిలీట్ చేసింది. దీంతో ప్రస్తుతం ఈ ఫీచర్ వెబ్ వెర్షన్ యూజర్లకు, మొబైల్ యాప్ యూజర్ లకు మాత్రమే అందుబాటులో ఉంది.

అయితే ఈ ఫీచర్ ను త్వరలో డెస్క్ టాప్ యూజర్లకు సెలెక్ట్ చాట్స్ పేరుతో వాట్సప్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిసింది. ఈ ఫీచర్ను తొలగించడం వల్ల యూజర్ల నుంచి వచ్చిన కంప్లైంట్ల వాట్సప్ తిరిగి తీసుకురావాలని భావించినట్లు తెలిసింది. త్వరలోనే సాధారణ యూజర్లకు కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ ఫీచర్ ద్వారా ఒకటి కంటే ఎక్కువ మెసేజ్లు సెలెక్ట్ ఫార్వర్డ్ కానీ డిలీట్ కానీ మ్యూట్ కానీ చెయ్యొచ్చు.

ఇదే కాకుండా మరో కొత్త ఫీచర్ ని కూడా అందుబాటులోకి తీసుకురావడానికి వాట్సప్ ప్రయత్నిస్తుందని తెలిసింది. అదేంటంటే టెక్స్ట్, మీడియా ఫైల్స్, వెబ్ లింక్ లను స్టేటస్ లో ఇతరులు చూసే విధంగా పెట్టుకుంటూ. అయితే ఈ విషయంలో ఇతర యూజర్లు వాటి పట్ల ఏవైనా అభ్యంతరాలు ఉంటే వెంటనే వాట్సప్ కు ఫిర్యాదు చెయ్యొచ్చు. దీనికోసం వాట్సాప్ స్టేటస్ అప్డేట్ రిపోర్ట్ అనే ఫీచర్ ను పరిచయం చేయటానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది.