Whatsapp: వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త.. ఇకపై స్క్రీన్‌ షేరింగ్ ఆప్షన్‌ అలా?

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిత్యం లక్షలాది మంది వినియోగదారులు వాట

  • Written By:
  • Publish Date - May 28, 2023 / 06:15 PM IST

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిత్యం లక్షలాది మంది వినియోగదారులు వాట్సాప్ ని ఉపయోగిస్తూనే ఉన్నారు. చాటింగ్ కోసం,వీడియో కాల్స్ అలాగే ఇతర అవసరాల కోసం వాట్సాప్ ని ఉపయోగిస్తూనే ఉంటారు. అంతేకాకుండా రోజురోజుకీ స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్యతో పాటు వాట్సాప్ వినియోగదారుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. దీంతో వాట్సాప్ సంస్థ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా వాట్సాప్ సంస్థ మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది.

వీడియో కాలింగ్‌ స్క్రీన్‌ షేరింగ్‌ ఆప్షన్‌ను వాట్సాప్‌ తీసుకొస్తోంది. సాధారణంగా జూమ్‌, గూగుల్‌ మీట్‌ వంటి యాప్స్‌లో ఈ స్క్రీన్‌ షేరింగ్ ఆప్షన్‌ ఉంది. ఆఫీస్‌ మీటింగ్‌ కానీ మరే ఇతర సమావేశాల్లోనైనా ఒక యూజర్‌ ఈ ఆప్షన్‌ ద్వారా తన స్క్రీన్‌ను గ్రూప్‌లో ఉన్న వారందరికీ షేర్‌ చేసే అవకాశం ఉంటుంది. అచ్చంగా ఇలాంటి ఫీచర్‌నే వాట్సాప్‌ సైతం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇప్పటికే ఈ ఫీచర్‌ను కొందరు బీటా టెస్టర్లకు వాట్సాప్‌ సంస్థ అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం టెస్టింగ్‌ దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఎవరితోనైనా వీడియో కాల్‌ మాట్లాడుతున్న సమయంలో మన మొబైల్‌ స్క్రీన్‌ను అవతలి వ్యక్తికి షేర్‌ చేసే అవకాశం లభించనుంది. ఇందుకోసం స్క్రీన్‌ అడుగు భాగంలో కొత్తగా స్క్రీన్‌ షేరింగ్‌ బటన్‌ను వాట్సాప్‌ ఇవ్వనుంది. ఈ బటన్‌ను క్లిక్‌ చేస్తే మీ ఫోన్‌లో చేసే ప్రతిదీ రికార్డు అవ్వడంతో పాటు అవతలి వ్యక్తికి షేర్‌ అవుతుంది. దీనికి యూజర్‌ అనుమతి తప్పనిసరి. ఇదిలా ఉంటే గ్రూప్‌ వీడియో కాల్‌లో ఎక్కువ మంది యూజర్లు ఉంటే స్క్రీన్‌ షేర్‌ ఆప్షన్‌ పనిచేయకపోవచ్చని తెలుస్తోంది.