Site icon HashtagU Telugu

Whatsapp: వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త.. మరో ఇంట్రెస్టింగ్ సెక్యూరిటీ ఫీచర్‌!

Mixcollage 20 Feb 2024 05 26 Pm 4966

Mixcollage 20 Feb 2024 05 26 Pm 4966

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిత్యం కోట్లాదిమంది ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్స్ లో వాట్సాప్ ముందు వరుసలో ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక వాట్సాప్ వినియోగదారుల సంఖ్య రోజుకి పెరుగుతూనే ఉండడంతో వినియోగదారులను మరింత ఆకర్షించడం కోసం వాట్సాప్ సంస్థ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తూనే ఉంది. ఇప్పటికే పదుల సంఖ్యలో కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేసింది వాట్సాప్ సంస్థ. తాజాగా కూడా మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది.

అయితే సెక్యూరిటీకి పెద్దపీట వేస్తూ వాట్సాప్‌ ఫీచర్‌లను పరిచయం చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఇంట్రెస్టింగ్ సెక్యూరిటీ ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది వాట్సాప్‌. యాప్‌లో లాక్‌ చేసిన చాట్‌లను వెబ్‌లో యాక్సెస్‌ చేసుకునేందుకు ప్రత్యేకంగా సీక్రెట్‌ కోడ్‌ అవసరమయ్యేలా ఈ కొత్త సెక్యూరిటీ ఫీచర్‌ను రూపొందిస్తున్నారు. దీంతో ఇటీవల మొబైల్‌ వెర్షన్‌లో తీసుకొచ్చిన లాక్‌ చాట్ ఫీచర్‌ను వెబ్‌ వెర్షన్‌కు కూడా విస్తరించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే యూజర్లందరికీ తీసుకొచ్చే పనిలో పడింది వాట్సాప్‌. లాక్‌ చేసిన చాట్‌లను వాట్సప్‌ వెబ్‌ ఓపెన్‌ చేయాలంటే ముందే సెట్‌ చేసుకున్న సీక్రెట్‌ కోడ్‌ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. తద్వారా వ్యక్తిగత లేదా రహస్య సమాచారం ఇతరులకు లీక్‌ కాకుండా ఉంటుంది.

ఈ ఫీచర్‌ ముఖ్యంగా ఆఫీసుల్లో పనిచేసే వారికి బాగా ఉపయోగపడనుంది. ఒకవేళ పొరపాటున లాగవుట్ చేయడం మర్చిపోయిన, మీ సీక్రెట్ చాట్‌లను ఎవరూ చూడకుండా ఉంటుంది. అయితే త్వరలోనే వాట్సాప్‌ అప్‌డేట్‌ వెర్షన్‌లో ఈ ఫీచర్‌ను యాడ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే వాట్సాప్‌లో లాక్‌ ఛాట్‌ను మరింత ఈజీగా మార్చేసింది. ఇందుకోసం ఇకపై ప్రత్యేకంగా సెటింగ్స్‌లోకి వెళ్లి ఫీచర్‌ను యాక్టివేట్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు. లాక్‌ చేయాలనుకున్న చాట్‌పై లాంగ్‌ ప్రెస్‌ చేసి లాక్‌ చాట్‌ ఆప్షన్‌ను ఎంచుకుంటే సరిపోతుంది.