Whatsapp: వాట్సాప్ లో ఇకమీదట ఈ ఫీచర్ తో డీప్ ఫేక్ వీడియోలకు పెట్టండిలా?

ఈ మధ్యకాలంలో హీరోయిన్లు సామాన్యులు ముఖ్యంగా అమ్మాయిలు ఎక్కడ చూసినా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దెబ్బకు భయపడుతున్నారు. ఈ టెక్నాలజీని

Published By: HashtagU Telugu Desk
Mixcollage 20 Feb 2024 05 35 Pm 6255

Mixcollage 20 Feb 2024 05 35 Pm 6255

ఈ మధ్యకాలంలో హీరోయిన్లు సామాన్యులు ముఖ్యంగా అమ్మాయిలు ఎక్కడ చూసినా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దెబ్బకు భయపడుతున్నారు. ఈ టెక్నాలజీని ఉపయోగించి అమ్మాయిల ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా వెబ్సైట్లో పెట్టడం లాంటివి చేస్తున్నారు. ముఖ్యంగా ఈ టెక్నాలజీతో రూపొందిస్తున్న డీప్‌ ఫేక్‌ వీడియోలు అందరినీ అలజడికి గురి చేస్తున్నాయి. సినిమా సెలబ్రిటీలు మొదలు రాజకీయ నాయకుల వరకు అంతా బాధితులుగా మారుతోన్న పరిస్థితి ఉంది. అయితే మొన్నటి మొన్న అమెరికా అధ్యక్షుడి ఫేక్‌ వీడియోను రూపొందించడం చర్చనీయాంశంగా మారింది.

దీంతో అమెరికా ప్రభుత్వం ఇలాంటి వీడియోలపై ఉక్కుపాదం మోపింది. ఇదిలా ఉంటే తాజాగా ప్రముఖ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్‌ సైతం డీప్‌ ఫేక్‌ వీడియోలకు చెక్‌ పెట్టే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఒక కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఈ విషయాన్ని మెటా అధికారికంగా ప్రకటించింది. ఫ్యాక్ట్-చెకింగ్ హెల్ప్‌లైన్‌ను ప్రారంభించేందుకు మిస్-ఇన్ఫర్మేషన్ కాంబాట్ అలయన్స్ , మెటా సంయుక్తంగా పనిచేయనున్నట్టు ఇరు సంస్థలు తాజాగా ప్రకటనలో వెల్లడించాయి. ఇందుకోసం ప్రత్యేక వాట్సాప్ చాట్‌బాట్‌ డిజైన్‌ చేశారు. దీనికి డీప్‌ఫేక్, నకిలీ సమాచారాన్ని పంపడం ద్వారా వాటిని కట్టడి చేసే వీలుంటుందట. వచ్చే నెలలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

ఈ చాట్‌బాట్ ఇంగ్లీష్‌తో పాటు దేశంలోని పలు ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. నకిలీ సమాచారం వైరల్‌ అవుతోన్న తరుణంలో దీనికి అడ్డుకట్ట వేయడానికి మొత్తం టెక్ పరిశ్రమ నుంచి సహకారం అవసరమని మెటా పబ్లిక్ పాలసీ ఇండియా డైరెక్టర్ శివనాథ్ తుక్రాల్ అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో డీప్‌ఫేక్ ద్వారా జరిగే మోసాలను నిలువరించేందుకు ఎంసీఏ సహకారంతో వాట్సాప్ హెల్ప్‌లైన్‌ను అందిస్తామని పేర్కొన్నారు.

  Last Updated: 20 Feb 2024, 05:36 PM IST