View Once Voice Notes : మనకు వాట్సాప్ లో ‘వ్యూ వన్స్’ ఆప్షన్ ఇప్పటివరకు ఫొటోలు, వీడియోలకు మాత్రమే అందుబాటులో ఉంది. అతి త్వరలోనే ఈ ఫీచర్ వాయిస్ (ఆడియో) క్లిప్స్ కోసం కూడా రిలీజ్ కానుంది. ‘వ్యూ వన్స్’ ఫీచర్ వల్ల మనం ఏదైనా ఫొటో లేదా వీడియోను ఒకేసారి ఓపెన్ చేసి చూడగలం. దాని స్క్రీన్ షాట్ ను తీసుకోవడం కూడా కుదరదు. ఇకపై ఇదే సౌలభ్యత వాయిస్ క్లిప్స్ కు కూడా అందుబాటులోకి వస్తుంది. అంటే మనం పంపే ఆడియో (వాయిస్) క్లిప్ ను ఇతరులు ఒకేసారి ఓపెన్ చేసి వినగలరు. రెండోసారి అది ఓపెన్ కాదు. ఆ వాయిస్ క్లిప్ ను ఇతరులు రికార్డు కూడా చేసేందుకు అనుమతి లభించదు.
We’re now on WhatsApp. Click to Join.
‘వ్యూ వన్స్ వాయిస్ నోట్స్’ ఫీచర్ వచ్చాక.. వాయిస్ రికార్డ్‌ను సెండ్ చేసే సమయంలోనే మనం ‘వ్యూ వన్స్’ ఆప్షన్ ను ఎంపిక చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ ను ఐఓఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్ ఫామ్ లలోని వాట్సాప్ బీటా వర్షన్ లో టెస్ట్ చేస్తున్నారు. ఆండ్రాయిడ్ లోని 2.23.21.15, 2.23.22.4 వాట్సాప్ బీటా వర్షన్లలో, iOSలోని 23.21.1.73 వాట్సాప్ బీటా వర్షన్ లో దీని టెస్టింగ్ జరుగుతోంది.
Also Read: Israel Army – Agniveer : ‘అగ్నివీర్’ స్కీంతో భారత్‌కు ఇజ్రాయెల్ తరహా ముప్పు : సామ్నా
వాట్సాప్ మల్టిపుల్ అకౌంట్ ఫీచర్ కోసం..
- వాట్సాప్ మల్టిపుల్ అకౌంట్ ఫీచర్ ను ఉపయోగించుకోవాలంటే.. మీ ఫోన్ రెండు సిమ్ కార్డులకు సపోర్ట్ చేసేదిగా ఉండాలి.
- మీ రెండో అకౌంట్ కు ఉపయోగించే నంబర్ సిమ్ కార్డు కూడా ఉండాలి.
- వాట్సాప్ సెటింగ్స్ లోకి వెళ్లి మీ ప్రొఫైల్ పై క్లిక్ చేస్తే యాడ్ అకౌంట్ అని ఆప్షన్ కన్పిస్తుంది. ఆ తర్వాత మరో అకౌంట్ ను యాజ్ చేసుకోవాలి.
- అనంతరం మీ ప్రొఫైల్ ను స్విచ్ చేసుకునేలా ఆప్షన్ కన్పిస్తుంది.
- దీంతో మీరు ఎప్పుడంటే అప్పుడు, ఏ అకౌంట్ కావాలంటే ఆ అకౌంట్ లోకి లాగిన్ కావచ్చు.