ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. నిత్యం కోట్లాదిమంది ప్రజలు ఈ వాట్సాప్ ను ఉపయోగిస్తూనే ఉంటారు. ఉదయం లేచిన దగ్గరనుంచి రాత్రి పడుకునే వరకు ఎక్కువగా వాట్సాప్ లోనే కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఇది ఇలా ఉంటే వాట్సాప్ సంస్థ వినియోగదారుల కోసం కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వచ్చిన వాట్సాప్ సంస్థ తాజాగా వినియోగదారుల కోసం మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఆ ఫీచర్ ఏంటి అన్న విషయానికి వస్తే.. మాములుగా ఇప్పటి వరకు వాట్సాప్ లో గ్రూప్ కాల్స్ వీడియో కాల్స్ లో ఒకేసారి 15 మంది యూజర్లు కలిసి మాట్లాడుకునే అవకాశం ఉంది. అయితే తాజాగా వాట్సాప్ ఇందులో కొత్త అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. వాట్సాప్ తీసుకొచ్చిన కొత్త అప్‌డేట్‌తో ఇకపై వాట్సాప్ గ్రూప్ కాల్స్‌లో ఏకంగా 32 మంది పాల్గొనే అవకాశం లభించనుంది. దీంతో ఒకే సారి 31 మంది గ్రూప్ కాల్స్‌లో మాట్లాడుకోవచ్చు. కాల్స్ ట్యాబ్‌కు అప్‌డేట్‌తో తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్ ప్రస్తుతానికి 2.23.19.16 బీటా టెస్టర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ఫీచర్ మాత్రమే కాకుండా ప్రైవసీ విషయంలో కూడా మరో సరికొత్త ఫీచర్ ని మరికొద్ది రోజుల్లో తీసుకురానుంది వాట్సాప్ సంస్థ.