Site icon HashtagU Telugu

Whatsapp: వాట్సాప్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. సెర్చ్ ఆన్ వెబ్ పేరుతో కొత్త ఫీచర్!

Whatsapp

Whatsapp

ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా యాప్స్ లో ఎక్కువ శాతం మంది ప్రతిరోజూ వినియోగిస్తున్న యాప్ వాట్సాప్. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ వాట్సాప్ ని నిత్యం కోట్లాదిమంది వినియోగిస్తున్న విషయం తెలిసిందే. రోజురోజుకీ వాట్సాప్ వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. అందుకు అనుగుణంగానే వాట్సాప్ సంస్థ కూడా ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తూనే ఉంది.

ఈ నేపథ్యంలోనే వాట్సాప్ సంస్థ తాజాగా మరో కొత్త ఫీచర్‌ ను పరిచయం చేసింది. సెర్చ్‌ ఆన్‌ వెబ్‌ పేరుతో ఈ ఫీచర్‌ ను తీసుకొచ్చింది. మరి ఈ ఫీచర్ ఎలా ఉపయోగపడుతుంది అన్న విషయానికి వస్తే. సాధారణంగా వాట్సాప్‌ లో ఏదైనా ఫొటోను పంపాలనుకుంటే గూగుల్‌ లేదా మరే ఇతర సెర్చ్‌ ఇంజన్‌ లో అయినా వెతుక్కొని డౌన్ లోడ్‌ చేసుకొని పంపిస్తుంటారు. అయితే ఇక పై ఆ అవసరం లేకుండా కొత్త ఫీచర్‌ ను తీసుకొచ్చింది వాట్సాప్. సెర్చ్‌ ఆన్‌ వెబ్‌ పేరుతో ఈ కొత్త ఫీచర్‌ ను పరిచయం చేశారు. ఈ కొత్త ఫీచర్‌ సహాయంతో యూజర్లు ఇతర బ్రౌజర్‌ లోకి వెళ్లకుండానే వాట్సాప్‌ లో ఇమేజెస్‌ ను సెర్చ్‌ చేసుకోవచ్చట.

వాట్సాప్‌ చాట్‌ ఓపెన్‌ చేయగానే పైన రైట్‌ సైడ్‌లో కనిపించే త్రీ డాట్స్‌ ను క్లిక్‌ చేయాలి. దానిపై క్లిక్‌ చేయగానే సెర్చ్‌ ఆన్‌ వెబ్‌ ఆనే ఆప్షన్‌ కనిపిస్తుంది. మీరు ఎలాంటి ఫొటో కావాలనుకుంటున్నారో ఎంటర్ చేస్తే ఫొటోలు వచ్చేస్తాయి. అయితే ప్రస్తుతం బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఫీచర్‌ ను త్వరలోనే యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అతి త్వరలోనే వాట్సాప్ వినియోగదారులందరికీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.