Site icon HashtagU Telugu

Whatsapp: వాట్సాప్ లో ఈ కొత్త ఫీచర్ ని గమనించారా.. ఇది ఎలా పని చేస్తుందంటే?

Whatsapp

Whatsapp

దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువమంది ఉపయోగిస్తున్న సోషల్ మీడియా యాప్స్ లో వాట్సాప్ కూడా ఒకటి. నిత్యం లక్షలాదిమంది కోట్లాదిమంది మెసేజ్ లు, చాటింగ్, వీడియో కాల్స్ కోసం వాట్సాప్ ను వినియోగిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా రోజురోజుకీ వాట్సాప్ వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. వినియోగదారులు పెరిగిపోతుండడంతో వాట్సాప్ సంస్థ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తూనే ఉంది. ఇప్పటికే ఎన్నో రకాల ఫీచర్ లను తీసుకువచ్చింది వాట్సాప్ సంస్థ.

ఇది ఇలా ఉంటే తాజాగా వాట్సాప్ సంస్థ మరో ఫీచర్ ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ ఫీచర్ ఏంటి అన్న విషయానికి వస్తే.. ఇప్పటి వరకు మనం వాట్సాప్‌లో ఏదైనా వీడియో రికార్డ్‌ చేసి పంపుకోవాలనుకుంటే కెమెరా బటన్‌ను నొక్కి పట్టుకోవాల్సి ఉండేది. ఒకవేళ బటన్‌పై నుంచి వేలు తీసేస్తే రికార్డింగ్‌ ఆగిపోతుంది. ఇలా వీడియో రికార్డు చేస్తున్నంత సేపు యూజర్లు వేలు కెమెరా బటన్‌పై ఉంచాల్సి వచ్చేది. అయితే తాజాగా వాట్సాప్‌ తీసుకొచ్చిన కొత్త ఫీచర్‌ ద్వారా ఈ సమస్యకు చెక్‌ పెట్టింది. వీడియో మోడ్‌ అనే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది వాట్సాప్ సంస్థ.
కెమెరా సెక్షన్‌లో వీడియో మోడ్‌ అనే ఫీచర్‌ను పరిచయం చేసింది.

దీంతో యూజర్లను కెమెరా ఓపెన్‌ చేయగానే కింద వీడియో, ఫొటో అనే రెండు ఆప్షన్స్‌ ఉంటాయి. అందులో వీడియోను సెలక్ట్ చేసుకొని రికార్డింగ్‌ బటన్‌పై క్లిక్‌ చేస్తే సరిపోతుంది. మీకు కావాల్సినంత సేపు వీడియో రికార్డింగ్‌ అవుతుంది. ఈ ఫీచర్‌ మీకూ యాడ్‌ అయ్యిందేమో చెక్‌ చేసుకోండి. ఒకవేళ అయ్యుండకపోతే ఓసారి వాట్సాప్‌ను అప్‌డేట్‌ చేసుకోవడం వల్ల ఈ ఫీచర్ మీ వాట్సాప్ లోకి రానుంది. అయితే ఈ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే చాలామంది వీడియో తీసేటప్పుడు అలాగే లాంగ్ ప్రెస్ చేయడానికి చాలా ఇబ్బంది కరంగా ఫీల్ అవుతూ ఉంటారు.