Site icon HashtagU Telugu

Whatsapp: వాట్సాప్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇకపై వాయిస్‌ మెసేజ్‌ను టెక్ట్స్‌ మెసేజ్‌ గా చేయచ్చట!

Whatsapp

Whatsapp

ఇటీవల కాలంలో వాట్సాప్ వినియోగం పెరిగిపోవడంతో వాట్సాప్ వెంట కూడా అందుకు అనుగుణంగానే నెలలో పదుల సంఖ్యలో కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంది. ఇప్పటికీ ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చిన వాట్సాప్ సంస్థ వినియోగదారులను మరింత ఆకర్షించడం కోసం కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తూనే ఉంది. ప్రైవసీ విషయంలో వాట్సాప్ స్టేటస్ ల విషయంలో చాటింగ్ విషయంలో ఇలా అనేక విషయాలలో మంచి మంచి ఫీచర్లను తీసుకువచ్చిన వాట్సాప్ సంస్థ తాజాగా మరో సరికొత్త ఫీచర్ ని తీసుకువచ్చింది. ఈ ఫీచర్ కోసం వినియోగదారులు ఎప్పటినుంచో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇంతకీ ఆ ఫీచర్ ఏమిటి? ఆ ఫీచర్ ఎలా ఉపయోగపడుతుంది అన్న వివరాల్లోకి వెళితే…

వాట్సాప్ యూజర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త ఫీచర్ ఇది. అంటే వాయిస్ మెసేజ్ లను టెక్స్ట్ మెసేజ్ లుగా మార్చే సరికొత్త ఫీచర్ ను వాట్సాప్ ఇప్పుడు అందుబాటులోకి తెచ్చింది. ఇంతకు ముందు యూజర్లు మరో యాప్‌ లో వాయిస్ మెసేజ్‌లను టెక్స్ట్ మెసేజ్‌ లుగా మార్చేవారు. కాని ఇప్పుడు వాట్సాప్ ఆ కొత్త ఫీచర్‌ ను అందిస్తోంది. వాట్సాప్ ఈ కొత్త అప్‌డేట్ వివిధ వ్యక్తులకు ఉపయోగపడుతుందని చెప్పడం గమనార్హం. అయితే ఈ అప్‌డేట్‌ తో మీరు వాయిస్ సందేశాలను ఇంగ్లీషులోనే కాకుండా హిందీలో కూడా మార్చుకోవచ్చట. ఈ కొత్త ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్‌ లలో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే పూర్తిస్థాయిలో అందరికీ అందుబాటులోకి రానుంది. ఇంతకీ ఈ ఫీచర్ ని ఎలా సెట్ చేసుకోవాలి అన్న విషయానికొస్తే..

వాట్సాప్‌ వాయిస్ నోట్ చేయడానికి, ముందుగా సెట్టింగ్‌ లకు వెళ్లి, చాట్‌పై క్లిక్ చేసి మీ వాయిస్ నోట్ ట్రాన్‌స్క్రిప్ట్‌ ను యాక్టివేట్ చేయడానికి మీకు ఒక ఎంపిక కనిపిస్తుంది. దాన్ని యాక్టివేట్ చేసిన తర్వాత, మీ వాయిస్ మెసేజ్ కింద వాయిస్ నోట్ ట్రాన్స్క్రిప్ట్ ప్రాంప్ట్ కనిపిస్తుంది. ఈ కొత్త ఫీచర్ మొబైల్ ఫోన్‌ లలో మాత్రమే ఉపయోగించుకోవచ్చు. వెబ్‌లో వాట్సాప్ ఉపయోగించలేరు. ఈ కొత్త ఫీచర్ 5 భాషల్లో ప్రవేశపెట్టారు. వీటిలో ఇంగ్లీష్, స్పానిష్, పోర్చుగీస్, రష్యన్, హిందీ భాషలల్లో ఉన్నాయి. ముఖ్యంగా, వినియోగదారులు ఈ 5 భాషల్లో వాయిస్ సందేశాలను వినియోగించుకోవచ్చు.