Site icon HashtagU Telugu

Whatsapp: వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త.. మీ చాట్ ఎవరికీ కనిపించకూడదంటే ఈ ట్రిక్ ఫాలో అవ్వాల్సిందే?

Whatsapp

Whatsapp

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిత్యం లక్షలాది మంది వాట్సాప్ ని వినియోగిస్తూనే ఉన్నారు. రోజురోజుకీ వినియోగదారుల సంఖ్య పెరిగిపోతుండటంతో వాట్సాప్ సంస్థ కూడా కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. సరికొత్త ఫీచర్ లతో వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది వాట్సాప్ సంస్థ. ఇది ఇలా ఉంటే తాజాగా వినియోగదారుల కోసం మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది వాట్సాప్ సంస్థ.

వాట్సాప్‌ చాట్‌ లాక్‌ పేరుతో ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చారు. మాములుగా వాట్సాప్‌లో వ్యక్తిగత చాట్స్‌ అందరికీ ఉంటాయి. ఫ్రెండ్స్‌తోనే, ఫ్యామిలీ మెంబర్స్‌తోనే వ్యక్తిగతంగా చేసే చాట్స్‌ ఉంటాయి. అయితే పొరపాటున లేదా ఉద్దేశపూర్వకంగానో పక్కనవారికి ఫోన్‌ ఇస్తే మన చాట్‌ వాళ్లు చూసే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమస్యకు చెక్‌ పెట్టడానికే వాట్సాప్‌ చాట్ లాక్‌ పేరుతో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌ సహాయంతో మీరు కోరుకున్న చాట్‌ లేదా వాట్సాప్‌ గ్రూప్‌లను ఎవరికీ కనిపించకుండా చేయవచ్చు. ఇంతకీ ఈ ఫీచర్‌ను ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అన్న విషయానికి వస్తే..

ఇందుకోసం ముందుగా మీ వాట్సాప్‌ను లేటెస్ట్‌ వెర్షన్‌కి అప్‌డేట్‌ చేసుకోవాలి. అనంతరం మీ ఫోన్‌లో వాట్సాప్‌ యాప్‌ను ఓపెన్‌ చేయాలి. తర్వాత మీరు లాక్‌ చేయాలనుకుంటున్న చాట్‌ను ఓపెన్‌ చేసి, ప్రొఫైల్‌పై క్లిక్‌ చేయాలి. తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే చాట్ లాక్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిని క్లిక్‌ చేసి లాక్‌ దిస్‌ చాట్ విత్ ఫింగర్‌ ప్రింట్ అనే ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. దీంతో ఒకపై ఆ చాట్ మెయిన్ చాట్ బాక్స్‌లో ఎవరికీ కనిపించదు. మరి మళ్లీ ఆ చాట్‌ను ఎలా ఓపెన్‌ చేసుకోవాలంటే ఇందుకోసం వాట్సాప్‌ను ఓపెన్‌ చేసి కిందికి స్క్రోల్ చేయాలి, ఇలా చేస్తే లాక్‌డ్‌ చాట్స్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేసి థంబ్‌ నెయిల్‌తో అన్‌లాక్‌ చేసుకుంటే సరి మీరు హైడ్‌ చేసిన చాట్ ఓపెన్‌ అవుతుంది.