WhatsApp: వాట్సాప్ లోకి మెటా అవతార్ ఫీచర్.. ఎలా పనిచేస్తుందో తెలుసా?

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సంస్థ వినియోగదారుల కోసం ఇప్పటికీ వాట్సాప్ లోకి ఎన్నో రకాల ఫీచర్ లను

  • Written By:
  • Publish Date - December 9, 2022 / 07:00 AM IST

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సంస్థ వినియోగదారుల కోసం ఇప్పటికీ వాట్సాప్ లోకి ఎన్నో రకాల ఫీచర్ లను అందుబాటులోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా వాట్సాప్ సంస్థ మెటాఅవతార్ ఫీచర్‌ను తీసుకువచ్చింది. అయితే వినియోగదారులు ప్రస్తుతం ఈ అవతార్‌ ఫీచర్‌ను ఉపయోగించవచ్చని మెటా కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ అవతార్‌లను వాట్సప్‌లో ప్రొఫైల్ పిక్చర్స్‌గా సెట్‌ చేసుకోవచ్చు. లేదంటే 36 కస్టమ్‌ స్టిక్కర్‌లుగా ఉపయోగించుకోవచ్చు. ఇంతకుముందు ప్రొఫైల్‌ పిక్చర్‌లను యూజర్‌ మాన్యువల్‌గా అప్‌లోడ్‌ చేయాల్సి వచ్చేది.

ఏదీ అప్‌లోడ్‌ చేయకపోతే బ్లాంక్‌గా ఉండేది. అయితే ఇప్పుడు వాట్సాప్‌ ప్రొఫైల్‌ పిక్చర్స్‌గా సెట్‌ చేసుకొనే అవతార్‌లను లాంచ్‌ చేసింది. తాజాగా వాట్సాప్ వినియోగదారుల కోసం తీసుకువచ్చిన మెటా అవతార్ ఫీచర్ గత కొంతకాలంగా ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌, డివైజ్‌లలో బీటా టెస్టర్‌ లకు అందుబాటులో ఉందని వెల్లడించింది. అయితే ప్రస్తుతానికి ఈ ఫీచర్ కొంతమంది వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. అయితే త్వరలోనే ఈ ఫీచర్ వినియోగదారులందరికీ అందుబాటులోకి వస్తుందని తెలిపింది వాట్సాప్ సంస్థ.

స్నాప్‌చాట్‌ లో కస్టమైజ్డ్‌ క్యారెక్టర్స్‌ మాదిరిగానే మెటా అవతార్‌ లను కూడా వర్చువల్‌గా BitmojiSగా క్రియేట్‌ చేయవచ్చు. అయితే మెటా ఈ ఫీచర్‌ని మరింత అభివృద్ధి చేయడంపై దృష్టి పెడుతుంది. కాగా వాట్సాప్‌లో యూజర్లు తమతో తాము కమ్యూనికేట్‌ కావడానికి ఈ ఫీచర్ ఉత్తమ మార్గం అని చెప్పవచ్చు. ఈ ఫీచర్ ఇటీవలే కొంతమందికి అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసింది. అయితే ప్లే స్టోర్ నుంచి ఆండ్రాయిడ్‌ డివైజ్‌ల కోసం వాట్సాప్‌ బీటాను అప్‌డేట్ చేసిన తర్వాత కొంతమంది బీటా టెస్టర్‌లు అవతార్‌ను క్రియేట్‌ చేసే ఆప్షన్‌ పొందారు. అవతార్‌ను క్రియేట్‌ చేసిన తర్వాత, మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వెంటనే కొత్త స్టిక్కర్ ప్యాక్‌ను క్రియేట్‌ చేస్తుంది. తద్వారా వినియోగదారులు తమ ప్రియమైన వారితో స్టిక్కర్‌లను షేర్‌ చేసుకోవచ్చు.