Site icon HashtagU Telugu

Whats APP : నేటి నుంచే వాట్సాప్ గ్రూప్ ల సైజు పెరగనుందోచ్.. 512కు పెంపు!

Whatsapp Imresizer

Whatsapp Imresizer

వాట్సాప్ గ్రూప్ లు వినియోగించే వారికి శుభవార్త!! గ్రూప్ మెంబర్ల సంఖ్య తక్కువగా ఉందనే ప్రశ్న ఇకపై ఉండదు. ఎందుకంటే.. ఇప్పటిదాకా 256గా ఉన్న వాట్సాప్ గ్రూప్ సభ్యుల సంఖ్య, రెట్టింపై 512కు పెరగనుంది. గత 2 నెలలుగా గ్రూప్ సభ్యుల లిమిట్ పెంపు ఫీచర్‌ను వాట్సాప్‌ పరీక్షిస్తోంది. దీన్ని బీటా వెర్షన్‌ వాడుతున్న వారికి ఇప్పటికే అందుబాటులోకి తెచ్చి టెస్ట్ చేసింది. అయితే ఈ అప్‌డేట్‌ ఇంకా అందరికీ అందుబాటులోకి రాలేదు. అతిత్వరలోనే అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ యూజర్లకు ఈ ఫీచర్‌ను వాట్సాప్‌ అందుబాటులోకి తెస్తోంది. ఇవాళ (శుక్రవారం) నుంచే దీనికి సంబంధించిన అప్ డేట్ ను వినియోగదారులకు విడుదల చేసే ప్రక్రియకు వాట్సాప్ శ్రీకారం చుట్టింది. ఇంకెందుకు ఆలస్యం గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి మీ వాట్సాప్ ను అప్ డేట్ చేసుకోండి. మీకు ఈ కొత్త అప్ డేట్ వచ్చిందో లేదో చూసుకోండి.