ఇటీవల కాలంలో వాట్సాప్ సంస్థ వినియోగదారుల కోసం కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తూనే కొన్ని వేల లక్షల అకౌంట్లను బ్యాన్ చేస్తూ వస్తోంది. అలాగే ఎప్పటికప్పుడు వాట్సాప్ లో హెచ్చరికలు కూడా జారీ చేస్తూనే వస్తోంది. ప్రస్తుతం చాలామంది వాట్సాప్ వినియోగదారులు పాత సాఫ్ట్ వేర్ ని ఉపయోగిస్తున్నారు. న్యూ వర్షన్లను అప్డేట్ చేసుకోకుండా పాత వర్షన్ లను ఉపయోగిస్తున్నారు. అయితే అలాంటి డివైజ్ లలో వాట్సాప్ తన సేవలను నిలిపివేస్తోంది. అంటే ఇప్పుడు వాట్సాప్ కొన్ని స్మార్ట్ ఫోన్లలో పనిచేయదట. ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా. మీరు విన్నది నిజమే.
ముఖ్యంగా కొన్ని రకాల కంపెనీల స్మార్ట్‌ఫోన్ లను ఉపయోగిస్తున్న వాట్సాప్ వినియోగదారులకు ఈ వార్త చాలా ముఖ్యమైనది అని చెప్పవచ్చు. వాట్సాప్ కంపెనీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదేం మొదటి సరికాదు. గతంలో ఇలాంటి నిర్ణయాన్ని చాలాసార్లు కంపెనీ తీసుకున్న విషయం తెలిసిందే. వాట్సాప్ వినియోగదారుల గొప్యత అలాగే భద్రత విషయాలను దృష్టిలో ఉంచుకొని ఇలాంటి నిర్ణయాలను ఎప్పటికప్పుడు తీసుకుంటోంది. అయితే ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న వాట్సాప్ సంస్థ తాజాగా మరో నిర్ణయం తీసుకుందట. ముఖ్యంగా ఆ లిస్టులో మీరు కూడా ఉంటే అప్రమత్తంగా ఉండాలని అలాగే మీ బ్యాకప్ ని సిద్ధం చేసుకోవాలని సూచిస్తోంది.
మరి ఎలాంటి స్మార్ట్ ఫోన్లలో పనిచేయదు అన్న విషయానికి వస్తే.. Android, iOS తాజా వెర్షన్ లు అందుబాటులోకి వచ్చాయి. అయితే పాత ఆండ్రాయిడ్, ఐఓఎస్ వెర్షన్ లలో వాట్సాప్ ను ఉపయోగిస్తున్న చాలా మంది వినియోగదారులు ఇప్పటికీ ఉన్నారు. ఆండ్రాయిడ్ 4, iOS 11 కంటే ముందు వెర్షన్ లు నడుస్తున్న ఫోన్ ల నుండి వాట్సాప్ తన మద్దతును ఉపసంహరించుకుంది. ప్రస్తుతం, వాట్సాప్ ఆండ్రాయిడ్ 5 లేదా iOS 11 కంటే ఎక్కువ వెర్షన్‌లు కలిగిన ఫోన్‌లకు మాత్రమే మద్దతు ఇస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ పేరును వాట్సాప్ ప్రస్తావించలేదు. అయితే CanalTech అనే వెబ్‌సైట్ ప్రకారం, జాబితాలో 35 స్మార్ట్ ఫోన్‌లు ఉన్నాయి. ఆ ఫోన్ లలో వాట్సాప్ ఫీచర్ ఆగిపోయింది. ఇందులో ఆపిల్ , శాంసంగ్ , Huawei, మోటారోలా స్మార్ట్‌ఫోన్ ల పేర్లు కూడా ఉన్నాయి.